ఇక ఇంటింటికీ టీకాలు

ABN , First Publish Date - 2021-11-03T12:44:24+05:30 IST

కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ఇప్పటివరకూ మెగా శిబిరాలను నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇక ఇంటింటికీ వెళ్లి టీకాలను వేయాలని నిర్ణయించింది. ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 79 వేల గ్రామాలలో

ఇక ఇంటింటికీ టీకాలు

                 - నూతన పథకాన్ని ప్రారంభించిన మంత్రి సుబ్రమణ్యం


చెన్నై(Chennai): కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ఇప్పటివరకూ మెగా శిబిరాలను నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇక ఇంటింటికీ వెళ్లి టీకాలను వేయాలని నిర్ణయించింది. ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 79 వేల గ్రామాలలో ఇంటింటికీ వెళ్ళి కరోనా నిరోధక టీకాలు వేసేలా ప్రణాళికలు రూపొందించింది. ఆ పథకాన్ని ఆరోగ్యశాఖమంత్రి ఎం.సుబ్రమణ్యం మధురాంతకం సమీపంలోని నల్లాంపాళయంలో లాంఛనంగా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఈ నెలాఖరులోగా వంద శాతం మొదటి విడత టీకాలు, 50 శాతం రెండో విడత టీకాల కార్యక్రమాలను పూర్తి చేయా లంటూ అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఆ మేరకు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్ళి టీకాలు వేసే పథకాన్ని ప్రారంభించ నున్నట్టు మంత్రి సుబ్రమణ్యం ఇటీవల ప్రకటిం చిన విషయం తెలిసిందే. ఆ పథకానికి నల్లాం పాళయం వద్ద శ్రీకారం చుట్టారు వ్యాక్సినేషన్‌ సంచార వాహనాలను జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో 18 యేళ్లకు పైబడినవారు 5కోట్ల 78 లక్షల వరకూ ఉన్నారని, వీరిలో 4 కోట్ల 10 లక్షల 39 వేల మందికి మొదటి విడత టీకాలు వేశామని చెప్పారు. కోటి 80 లక్షల మందికిపైగా రెండో విడత టీకాలు వేసుకున్నారని తెలిపారు. ఈ నెలాఖరులోగా వంద శాతం మొదటి విడత వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని 79 వేల గ్రామాల్లో ఇంటింటికీ వెళ్ళి టీకాలు వేసే కార్యక్రమాలను ప్రారంభించామని చెప్పారు. ఈ నెలాఖరు వరకూ కొవాగ్జిన్‌, కొవిషీల్ట్‌ టీకాలతో డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు, నర్సులు సంచార వాహనాలలో వెళ్ళి ఇళ్ల వద్దే టీకాలు వేయనున్నారని ఆయన వివరించారు. 

Updated Date - 2021-11-03T12:44:24+05:30 IST