ఇంటింటికీ కావేరీ జలాలు: సీఎం

ABN , First Publish Date - 2022-03-18T18:21:45+05:30 IST

నగరంలో ఇంటింటికీ కావేరీ జలాలు అందించేందుకు కట్టుబడ్డామని సీఎం బసవరాజ్‌ బొమ్మై స్పష్టం చేశారు. విధానపరిషత్‌లో గురువారం బెంగళూరులో తాగునీటి సమస్య

ఇంటింటికీ కావేరీ జలాలు: సీఎం

                 - రాజధాని వాసుల దాహార్తి తీర్చడానికి కట్టుబడి ఉన్నాం

 

బెంగళూరు: నగరంలో ఇంటింటికీ కావేరీ జలాలు అందించేందుకు కట్టుబడ్డామని సీఎం బసవరాజ్‌ బొమ్మై స్పష్టం చేశారు. విధానపరిషత్‌లో గురువారం బెంగళూరులో తాగునీటి సమస్య అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ కావేరీ ఐదవ విడత పనులను రూ. 5,500 కోట్లతో అమలు చేస్తున్నామని, 2023 చివరకు పూర్తి కానున్నాయన్నారు. తద్వారా నగరవ్యాప్తంగా ఇంటింటికీ కావేరి నీరు సాధ్యం కానుందన్నారు. కాంగ్రెస్‌ సభ్యుడు గోవిందరాజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా జలమండలిలో రెండు అంతస్తులకు అనుమతులు తీసుకుని అంతకుమిం చి నిర్మాణాలు చేపట్టిన నివాసాలకు 50 శాతం, వాణిజ్య సముదాయాలకు వందశాతం జరిమానా విధిస్తామన్నారు. జలమండలి ద్వారా నీటి సరఫరా, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పర్యవేక్షణ నిరంతరంగా సాగుతోందన్నారు. నగరంలోకి కొత్తగా విలీనమైన ప్రాంతాలకు కావేరి నీరు సమకూర్చేందుకు కట్టుబడ్డామన్నారు. ఇదే సందర్భంగా రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల కుటుంబీకులకు 2025 నుంచి ‘జ్యోతి సంజీవని’ పథకం కింద నగదు రహిత చికిత్సలు అం దిస్తామన్నారు. సభ్యురాలు భారతిశెట్టి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏడు తీవ్రమైన జబ్బులకు నగదు రహిత చికిత్స అందించేందుకు జ్యోతి సంజీవని అమలు చేయదలిచామన్నారు. హృద్రోగం, నరాలజబ్బులు, కేన్సర్‌, కిడ్నీ, కాలిన గాయలు, నవజాతశిశువులు, పిల్లల్లో వచ్చే తీవ్రమైన జబ్బులకు చికిత్సలు అనుసంధానం చేస్తామన్నారు. ‘జ్యోతి సంజీవని’ పథకాన్ని రిటైర్డు ఉద్యోగులకు వర్తింపచేయలేదని, పరిశీలిస్తామన్నారు. 

Updated Date - 2022-03-18T18:21:45+05:30 IST