కంటెయినర్లతో ఇల్లు!

ABN , First Publish Date - 2021-03-10T05:54:56+05:30 IST

మూడు అంతస్థుల భవనం నిర్మించాలంటే గుంతలు తీయాలి, పిల్లర్లు పోయాలి, స్లాబ్‌ వేయాలి, గోడలు కట్టాలి... ఇలా చాలా పనులు నెలలు తరబడి చేస్తే కానీ పూర్తి కాదు. కానీ హూస్టన్‌లోని మెక్‌గోవెన్‌ స్ట్రీట్‌లో ఉన్న ఓ ఇంటిని చూస్తే మీ అభిప్రాయం

కంటెయినర్లతో ఇల్లు!

మూడు అంతస్థుల భవనం నిర్మించాలంటే గుంతలు తీయాలి, పిల్లర్లు పోయాలి, స్లాబ్‌ వేయాలి, గోడలు కట్టాలి... ఇలా చాలా పనులు నెలలు తరబడి చేస్తే కానీ పూర్తి కాదు. కానీ హూస్టన్‌లోని మెక్‌గోవెన్‌ స్ట్రీట్‌లో ఉన్న ఓ ఇంటిని చూస్తే మీ అభిప్రాయం మార్చుకుంటారు. ఎందుకో తెలుసా? బ్రూక్స్‌ అనే వ్యక్తి  కంటెయినర్లతో మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నాడు.

  • సరుకు రవాణాకు ఉపయోగించే పెద్ద పెద్ద షిప్పింగ్‌ కంటెయినర్లను చూసే ఉంటారు. హూస్టన్‌కు చెందిన డిజైనర్‌ విల్‌ బ్రూక్స్‌ ఆ కంటెయినర్లతో ఇల్లు నిర్మించుకున్నాడు. ఒక్కరోజులోనే మూడు అంతస్తుల నిర్మాణం పూర్తి చేశాడు. ఇందుకోసం 11 కంటెయినర్లను ఉపయోగించాడు. 
  • బయట నుంచి చూస్తే కంటెయినర్లు కనిపిస్తాయి కానీ లోపల అడుగుపెడితే మాత్రం సకల సదుపాయాలతో అధునాతన విల్లాను తలపించేలా ఉంటుంది. 
  • ఈ ఇంటికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. విల్‌ బ్రూక్స్‌ ఐడియాకు నెటిజన్లు హ్యాట్సాఫ్‌ అంటున్నారు.

Updated Date - 2021-03-10T05:54:56+05:30 IST