ఇళ్ల కేటాయింపులో న్యాయం చేయాలి

ABN , First Publish Date - 2021-07-26T06:54:49+05:30 IST

హస్తినాపురం డివిజన్‌ నందనవనంలో ప్రభుత్వం నిర్మించిన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్ల కేటాయింపులో తమకు న్యాయం చేయాలని

ఇళ్ల కేటాయింపులో న్యాయం చేయాలి

రేవంత్‌రెడ్డిని కలిసిన బాధితులు

చంపాపేట, జూలై 25 (ఆంధ్రజ్యోతి): హస్తినాపురం డివిజన్‌ నందనవనంలో ప్రభుత్వం నిర్మించిన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్ల కేటాయింపులో తమకు న్యాయం చేయాలని డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఎల్‌బీనగర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి మల్‌రెడ్డి రాంరెడ్డికి బాధితులు వినతిపత్రం అందజేశారు. నందనవనంలో మూడేళ్ల కిందట జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్ల నిర్మాణం పూర్తి అయినట్లు, ఒక్కో ఇంటికి రూ. 82.500 తీసుకొని 80 మందికిఇళ్లు కేటాయించారని తెలిపారు. మిగతా 4 వందల గృహాలను స్థానిక నేతలు  ఇతరులకు రూ. 3 నుంచి 5 లక్షలకు అమ్ముకున్నారని తెలిపారు. బాధితులతో కలిసి మల్‌రెడ్డి రాంరెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డిని కలిశారు. రేవంత్‌ కలెక్టర్‌తో మాట్లాడి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. త్వరలో హౌసింగ్‌ బోర్డ్‌ అధికారులతో కలిసి తాను నందనవనం సందర్శించనున్నట్లు బాధితులకు హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-07-26T06:54:49+05:30 IST