తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహిస్తున్న బుడిగజంగాల కుటుంబాలు
కనగల్, జనవరి 20: ఇళ్లస్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ బుడిగజంగాల కులానికి చెందిన 40 కుటుంబాలు గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందించారు. గత 20 సంవత్సరాలుగా కనగల్ ఎక్స్‌రోడ్డు శివారులో గుడిసెల్లో నివసిస్తున్న తమకు ఇళ్లు మంజూరు చేయాలన్నారు. పేదరికంలో ఉన్న తమను ఆదుకోవాలని వేడుకున్నారు.