
- బోడసకుర్రు టిడ్కో ఇళ్లకు కలగని మోక్షం
- ప్రస్తుతానికి జియో ట్యాగింగే.. ఉగాదికి కేటాయింపు లేనట్టే
- మౌలిక సదుపాయాల కల్పన ఎప్పుడో మరి
(అమలాపురం-ఆంధ్రజ్యోతి)
గత కొన్నేళ్లుగా లబ్ధిదారులను ఉవ్విళ్లూరిస్తూ వస్తున్న టిడ్కో భవనాల పంపిణీ ప్రక్రియలో తొలి అడుగు పడుతోంది. గతంలో కొవిడ్ కేర్ సెంటర్లుగా సేవలు అందించిన టిడ్కో భవనాలను ఖాళీచేసి లబ్ధిదారులకు అందించే ప్రక్రియను ప్రారంభించారు. అల్లవరం మండలం బోడసకుర్రులో నిర్మించిన టిడ్కో భవనాల సముదాయంలో గత రెండ్రోజుల నుంచి లబ్ధిదారులకు జియో ట్యాగింగ్ ప్రక్రియను అమలాపురం మున్సిపల్ అధికారులు చేప ట్టారు. ఇప్పటివరకు 532 మంది పైబడిన లబ్ధిదారులకు జియో ట్యాగింగ్ పూర్తయింది. అయితే లబ్ధిదారులను జియో ట్యాగింగ్ వరకే పరిమితం చేయవచ్చని, వీరికి ఆ గృహాల్లో అడుగుపెట్టే పరిస్థితి మాత్రం ఇప్పట్లో ఉండదనేది లబ్ధిదారులను వేధిస్తున్న ప్రశ్న. దీంతో టిడ్కో ఇళ్ల పంపిణీ త్వరలోనే చేపడతామంటూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ఆచరణ సాధ్యం కావడం లేదు. లబ్ధిదారుల పేరిట ఫ్లాట్లను రిజిస్ర్టేషన్ చేసి ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ రిజిస్ర్టేషన్ల ప్రక్రియలో ప్రతిష్ఠంభన కొనసాగనుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో భవనాలను వైసీపీ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా పక్కన పెట్టేసింది. పట్టణ ప్రాంతాల్లోని పేదలకు టౌన్షిప్లో ఫ్లాట్ల పంపిణీ గత రెండు న్నరేళ్లుగా విస్మరిస్తూ వస్తున్నారు. జిల్లాలో అల్లవరం మండలం బోడసకుర్రు టిడ్కో భవనాలను కొవిడ్ కేర్ సెంటర్లుగా పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ఉపయోగించుకున్నారు. మరోవైపు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఫ్లాట్ల కోసం ఎంపికైన లబ్ధి దారులను స్ర్కూట్నీ చేసి జాబితాలు సిద్ధం చేసినా ఆ ఫ్లాట్లు ఇప్పట్లో వీరికి అప్పగించే పరిస్థితి కనిపించడం లేదు. అయితే బోడసకుర్రులోని టిడ్కో గృహ సముదాయాలకు సంబంధించి కొందరు లబ్ధిదారులు బ్యాంకుల ద్వారా రుణాలు పొందారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రుణాలను ప్రభుత్వా నికి చెల్లించిన బ్యాంకులు సదరు ఖాతాదారుడు నెలసరి వాయి దాలు చెల్లించాలంటూ పలువురు లబ్ధిదారులకు తాఖీదులు అందుతున్నాయి. అసలు ఫ్లాటే కేటాయించకుండా బ్యాంకులకు రుణాలు ఎలా కట్టాలంటూ లబ్ధిదారులు మున్సిపల్ అధికారుల తీరుపై లబోదిబోమంటున్నారు. ఈ తరుణంలో లబ్ధిదారుల ఒత్తి డిని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ అధికారులు జియో ట్యాగింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. బోడసకుర్రులో 1632 ఫ్లాట్లకు సంబంధించి బుధవారం 212 ఫ్లాట్లకు జియో ట్యాగింగ్ ప్రక్రియ పూర్తికాగా, గురువారం 320 ఫ్లాట్లకు సంబంధించిన లబ్ధిదారు లకు జియో ట్యాగింగ్ ప్రక్రియను పూర్తిచేసినట్టు మున్సిపల్ కమిషనర్ వి.అయ్యప్పనాయుడు తెలిపారు. శుక్రవారం కూడా జియో ట్యాగింగ్ కొనసాగిందని చెప్పారు. ఇందులో కొందరికి బ్యాంకు రుణాలు మంజూరయ్యాయని, కొందరికి మంజూరు కావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం లబ్ధిదారులకు జియో ట్యాగింగ్ మినహా గృహాలను ఇంకా కేటాయించే పరిస్థితులు లేవన్నారు. రుణాలు పొంది అన్ని ప్రక్రియలు పూర్తయిన వారికి ఫ్లాట్లు రిజి స్ర్టేషన్ చేసి త్వరలో ఇవ్వనున్నట్టు చెబుతున్నారు. కాగా మంచి నీటితో పాటు మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత లబ్ధిదా రుల్లో కొంతమందికి దశలవారీగా ఫ్లాట్లను అప్పగిస్తారు. లబ్ధిదా రులు మాత్రం ఉగాది నాటికి టిడ్కో ఇళ్ల తాళాలు ఇచ్చేస్తారనే ఆశతో జియో ట్యాగింగ్ కోసం గంటల తరబడి బోడసకుర్రు టిడ్కో ఇళ్ల వద్ద మహిళలు తమ పిల్లలతో క్యూ కడుతున్నారు.