అసోంలో వెల్లువెత్తిన flash floods...

ABN , First Publish Date - 2021-10-18T13:19:28+05:30 IST

అసోం రాష్ట్రంలో కురిసిన భారీవర్షాల కారణంగా పశ్చిమ కర్బి ఆంగ్లాంగ్ ప్రాంతంలో మెరుపు వరదలు సంభవించాయి...

అసోంలో వెల్లువెత్తిన flash floods...

కొట్టుకుపోయిన ఇళ్లు, వంతెనలు

గౌహతి (అసోం): అసోం రాష్ట్రంలో కురిసిన భారీవర్షాల కారణంగా పశ్చిమ కర్బి ఆంగ్లాంగ్ ప్రాంతంలో మెరుపు వరదలు సంభవించాయి. అసోంలోని పశ్చిమ కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలోని బైతలాంగ్సో ప్రాంతంలో భారీ వర్షం కురిసింది.దీంతో వరదలు వెల్లువెత్తడంతో పలు ఇళ్లు, వంతెనలు, రోడ్లు కొట్టుకుపోయాయి.కొండ జిల్లాలోని బైతలాంగ్సో పోలీసుస్టేషన్ పరిధిలోని అమ్ ట్రెంగ్ సమీప ప్రాంతాలు వరద విపత్తుతో అల్లాడాయి. అమ్ ట్రెండ్ మార్కెటులో ఒక్కసారిగా వరదనీరు పోటెత్తడంతో దుకాణాలు, వ్యాపార సంస్థలు, కొట్టుకుపోయాయి. 


అమ్ ట్రెంగ్ నుంచి గౌహతికి వచ్చే రెండు ప్రధాన రహదారులు వరదనీటి ప్రవాహంతో దెబ్బతిన్నాయి.మెరుపు వరదలతో ఇళ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయని స్థానికులు చెప్పారు. వరదనీటి ప్రవాహంతో అమ్ ట్రెంగ్ నుంచి కర్బి లాంగ్ పి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును కలిపే రహదారి పూర్తిగా బ్లాక్ అయింది. అసోంలో కురిసిన భారీవర్షాలతో సంభవించిన మెరుపు వరదల వల్ల భారీగా ఆస్తినష్టం సంభవించింది. 


Updated Date - 2021-10-18T13:19:28+05:30 IST