New buildings: రూ. 26కోట్లతో గృహనిర్మాణ సంస్థ భవనాలు

ABN , First Publish Date - 2022-08-04T16:05:17+05:30 IST

రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో వేలూరు, తిరుచ్చి, మదురై(Vellore, Trichy, Madurai) జిల్లాల్లో నిర్మించిన పలు భవనాలను ముఖ్యమం

New buildings: రూ. 26కోట్లతో గృహనిర్మాణ సంస్థ భవనాలు

                                       - ప్రారంభించిన సీఎం స్టాలిన్‌


చెన్నై, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో వేలూరు, తిరుచ్చి, మదురై(Vellore, Trichy, Madurai) జిల్లాల్లో నిర్మించిన పలు భవనాలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) బుధవారం ఉదయం ప్రారంభించారు. సచివాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రాంతీయ కార్యాలయం, గృహనిర్మాణ సంస్థ కార్యాలయం, శాటిలైట్‌ సిటీ ప్రాంతీయ కార్యాలయం, అతిథిగృహాలను భవనాలకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. వేలూరు జిల్లా సత్తువాచేరి, తిరుచ్చి జిల్లా సాత్తనూరు గ్రామం కేకే నగర్‌లో, మదురై జిల్లా తోప్పూరు, ఉచ్చిపట్టి గ్రామాల్లో ఈ కొత్త భవనాలను నిర్మించారు. ఈ కార్యక్రమంలో మత్రులు ఎస్‌.ముత్తుసామి, పళనివేల్‌ త్యాగరాజన్‌, గృహనిర్మాణ సంస్థ అధ్యక్షులు పూచ్చి మురుగన్‌ తదితరులు పాల్గొన్నారు.


ఆర్టీవో కార్యాలయ భవనాలు...

సచివాలయంలో జరిగిన మరొక కార్యక్రమంలో విల్లుపురం జిల్లా సెంజి, మైలాడుదురై జిల్లా సీర్గాళిలో రూ.1.62 కోట్లతో నిర్మించిన ప్రాంతీయ రవాణా శాఖాధికారి కార్యాలయ భవనం, రూ.3.72 కోట్లతో నిర్మించిన ఆర్టీవో కార్యాలయ భవనం, డ్రైవర్ల ఎంపిక కేంద్ర భవనాలకు వీడియో కాన్ఫరెన్స్‌(Video conference) ద్వారా స్టాలిన్‌ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మత్రి ఎస్‌ఎస్‌ శివశంకర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి కే ఫణీందర్‌రెడ్డి, రవాణా శాఖ కమిషనర్‌ ఎల్‌.నిర్మల్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-04T16:05:17+05:30 IST