హౌసింగ్‌ కార్యాలయంలో విజిలెన్స్‌ అధికారుల పరిశీలన

ABN , First Publish Date - 2022-07-01T02:52:43+05:30 IST

అల్లూరు గృహనిర్మాణ శాఖ కార్యాలయంలో విజిలెన్స్‌ నాణ్యతా ప్రమాణాల అధికారులు గురువారం రికార్డుల పరిశీలన చేపట్టారు. వి

హౌసింగ్‌ కార్యాలయంలో  విజిలెన్స్‌ అధికారుల పరిశీలన
వివరాలు తెలుసుకుంటున్న విజిలెన్స్‌ అధికారి చంద్రశేఖర్‌రాజు

అల్లూరు, జూన్‌ 30 : అల్లూరు గృహనిర్మాణ శాఖ కార్యాలయంలో విజిలెన్స్‌ నాణ్యతా ప్రమాణాల అధికారులు గురువారం రికార్డుల పరిశీలన చేపట్టారు. విజయవాడ నుంచి వచ్చిన నాణ్యతా ప్రమాణాల అధికారి చంద్రశేఖర్‌రాజు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు  తనిఖీలు చేపట్టామన్నారు.  ముందుగా వచ్చిన సిమెంట్‌, స్టీల్‌ను కాంట్రాక్టర్లకు కాకుండా లబ్ధిదారులకు అందజేయాలని సూచించామన్నారు. రికార్డులను పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్‌ ఏఈ జయరామ్‌, హౌసింగ్‌ ఏఈ అబ్దుల్‌ జమీర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-01T02:52:43+05:30 IST