30లోగా గృహనిర్మాణాలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-06-17T05:08:46+05:30 IST

పేదలందరికీ మొదటి విడతలో మంజూరుచేసిన ఇళ్ల నిర్మాణం నెలాఖరు నాటికి ప్రారంభం కావాలని సీఎం జగన్‌ ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. మూడో ఆప్షన్‌ ఎంచుకున్న లబ్ధిదారుల కోసం కాంట్రాక్టర్లతో మాట్లాడి పేదలను బృందాలుగా ఏర్పాటు చేయాలన్నారు.

30లోగా గృహనిర్మాణాలు ప్రారంభం
మాట్లాడుతున్న సీఎం జగన్‌

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌ 

కలెక్టరేట్‌, జూన్‌ 16: పేదలందరికీ మొదటి విడతలో మంజూరుచేసిన ఇళ్ల నిర్మాణం నెలాఖరు నాటికి  ప్రారంభం కావాలని సీఎం జగన్‌ ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. మూడో ఆప్షన్‌ ఎంచుకున్న లబ్ధిదారుల కోసం కాంట్రాక్టర్లతో మాట్లాడి పేదలను బృందాలుగా ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధులతో మాట్లాడి గృహ నిర్మాణాల్లో సమస్యలుంటే పరిష్కరించుంటూ ముందుకు వెళ్లాలన్నారు. కరోనా మూడో దశ వస్తుందో... రాదో.. ఖచ్చితంగా చెప్పలేమని, అయినా ముందుచూపుతో పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండాలని సూచించారు. ప్రసుత్తం కేసులు తగ్గుతున్నాయని, నిర్లక్ష్యం చేయొద్దని, కొవిడ్‌ నిబంధనలను పాటించాలని చెప్పారు. రైతులకు మేలు జరగాలంటే ఇ-క్రాపు బుకింగ్‌ సమర్థంగా చేయాలని సూచించారు. ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న పనులు వేగవంతం కావాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌, ఎస్పీ బి.రాజకుమారి, జాయింట్‌ కలెక్టర్లు కిషోర్‌కుమార్‌, ఆర్‌.మహేష్‌కుమార్‌, మయూర్‌ అశోక్‌, జె.వెంకటరావు, డీఆర్‌వో గణపతిరావు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-06-17T05:08:46+05:30 IST