సూర్య సినిమా చూసి స్కెచ్ గీశాడు.. విమానాశ్రయంలో ఈ ఆంధ్రా కుర్రాడి పర్ఫామెన్స్ అదుర్స్.. చివరకు సీన్ రివర్స్..!

Jun 16 2021 @ 21:12PM

తమిళ హీరో సూర్య నటించిన `ఆకాశం నీ హద్దురా` సినిమా చూశారా? అందులో తండ్రికి ఆరోగ్యం బాగోలేదనే విషయం తెలిసి సూర్య ఇంటికి బయల్దేరతాడు. తన టికెట్‌కు సరిపడా డబ్బులు లేకపోవడంతో విమానాశ్రయంలోని ఇతర ప్రయాణీకులను అడుగుతాడు. నిజ జీవితంలో అలాంటి ట్రిక్కునే ప్రయోగిస్తూ మోసం చేస్తున్న ఓ తెలుగు యువకుడిని ముంబై పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. 


ఈ ఏడాది జనవరిలో రఘునందన్ ఠాక్రే దుబాయ్ వెళ్లేందుకు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. అతని దగ్గరుకు వెంకట్ శ్రీనివాస్ అనే వ్యక్తి వచ్చి.. `నేను ఓ పరీక్ష కోసం చండీఘడ్ వెళ్లాలి. నేను ఎక్కాల్సిన విమానం వెళ్లిపోయింది. మరో విమానం ఎక్కడానికి నా దగ్గర డబ్బుల్లేవు. మీరు 7,500 రూపాయలు ఇస్తే.. రేపు మీకు గూగుల్ పే ద్వారా పంపేస్తాన`ని చెప్పాడు. ఆ వ్యక్తి మాటలను నమ్మిన రఘునందన్ అతనికి రూ.7500 ఇచ్చారు. తర్వాతి రోజు డబ్బుల కోసం రఘునందన్ ఫోన్ చేయగా శ్రీనివాస్ కన్నడలో తిట్టాడు. 


దుబాయ్ నుంచి ఆదివారం తిరిగి వచ్చిన రఘునందన్‌కు శ్రీనివాస్ అదే విమానాశ్రయంలో లగేజ్ కౌంటర్ వద్ద కనిపించాడు. తన తల్లికి బాగోలేదని చెప్పి వేరొక వ్యక్తిని డబ్బులు అడుగుతున్నాడు. దీంతో రఘునందన్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దీంతో పోలీసులు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి విచారించారు. శ్రీనివాస్ ఢిల్లీ, చెన్నై, బెంగళూరు విమానాశ్రయాల్లో కూడా ఇదే ట్రిక్‌ను ప్రయోగించి ఇతరుల నుంచి డబ్బులు తీసుకున్నట్టు గుర్తించారు. ప్రస్తుతం అతను పోలీస్ కస్టడీలో ఉన్నాడు. 

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...