పన్నెండు నెలల బాబుకు ఉన్న ఆ సమస్యను ఎలా అధిగమించవచ్చు?

ABN , First Publish Date - 2022-02-04T17:55:46+05:30 IST

చిన్నపిల్లల్లో ఏదైనా బలమైన దెబ్బ తగలడం, ఇన్‌ఫెక్షన్‌ రావడం, రోగనిరోధక వ్యవస్థలో లోపాలు, రక్తప్రసరణలో అంతరాయాలు, పుట్టుకతో వచ్చే జన్యుసంబంధిత వ్యాధులు ఇలా అనేక కారణాల వల్ల నరాలకు లేదా నాడీ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు

పన్నెండు నెలల బాబుకు ఉన్న ఆ సమస్యను ఎలా అధిగమించవచ్చు?

ఆంధ్రజ్యోతి(04-02-2022)

ప్రశ్న: నా స్నేహితుడి బాబుకు పన్నెండు నెలలు. నరాల బలహీనత ఉంది. ఎలాంటి ఆహారంతో ఆ సమస్యను అధిగమించవచ్చు?


- సురేశ్‌, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: చిన్నపిల్లల్లో ఏదైనా బలమైన దెబ్బ తగలడం, ఇన్‌ఫెక్షన్‌ రావడం, రోగనిరోధక వ్యవస్థలో లోపాలు, రక్తప్రసరణలో అంతరాయాలు, పుట్టుకతో వచ్చే జన్యుసంబంధిత వ్యాధులు ఇలా అనేక కారణాల వల్ల నరాలకు లేదా నాడీ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు రావచ్చు. ఎదుగుదల సక్రమంగా లేకపోవడం, తల పరిమాణం వయసు కంటే ఎక్కువ లేదా తక్కువగా ఉండడం, సమన్వయ లోపం, మానసిక స్థితి స్థాయిలో మార్పులు రావడం, కండరాలు బిగుసుకోవడం, వణుకు, మూర్ఛ లాంటివి చిన్నపిల్లల్లో నరాల వ్యాధులకు సంబంధించిన లక్షణాలు. నరాల సమస్యలు ఉన్న పిల్లల్లో సాధారణంగా ఆహారం తీసుకోవడంలో కూడా ఇబ్బందులు ఉంటాయి. దీనికి సంబంధించిన ఆహార నియమాలు వ్యాధి, దాని లక్షణాల తీవ్రతను బట్టి మారుతుంటాయి. కనుక నరాల వ్యాధి నిపుణులు, దానికి సంబంధించిన డైటీషియన్ల సలహాతో మాత్రమే వ్యాధి ఉన్న పిల్లల ఆహారాన్ని నిశ్చయించుకోవాలి. 


  • డా. లహరి సూరపనేని
  • న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్
  • nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను
  • sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2022-02-04T17:55:46+05:30 IST