ఈ ప్రపంచంలో మిమ్మల్ని పోలినవారు నిజంగా ఉన్నారా?... నిపుణులు ఏమంటున్నారంటే...

ABN , First Publish Date - 2022-09-29T14:43:50+05:30 IST

సినిమాల్లో ఒకే పోలికలు కలిగిన వారిని చూస్తుంటాం.

ఈ ప్రపంచంలో మిమ్మల్ని పోలినవారు నిజంగా ఉన్నారా?... నిపుణులు ఏమంటున్నారంటే...

సినిమాల్లో ఒకే పోలికలు కలిగిన వారిని చూస్తుంటాం. ఈ విధంగా నిజ జీవితంలో ఎవరైనా ఉంటారా? మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని చాలామంది చెబుతుంటారు. దీని గురించి పీడియాట్రీషియన్ డాక్టర్ అరుణ్ షా మాట్లాడుతూ ఇది సోషల్ మీడియా యుగం. ఫేమస్ అయిన వ్యక్తిని పోలినవారి ఫొటోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారుతున్నాయి. అయితే ఈ ప్రపంచంలో ఒక వ్యక్తిని పోలినట్లు మరొకరు ఉండరు. ఫొటోల్లో ఇద్దరు వ్యక్తుల ముఖాలు ఒకే మాదిరిగా కనిపించినా, వారి మధ్య  లెక్కలేనన్ని తేడాలు ఉంటాయి.  


వారి కళ్లలోని రెటీనా, చేతి వేలి ముద్రలు భిన్నంగా ఉంటాయి. ఒకరిని పోలినట్టు మరొకరు ఉండటమనేది ఒక అపోహ. దీనివెనుక ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఒకవేళ ఒకేలా కనిపించే ఇద్దరికీ డీఎన్ఏ పరీక్షలు చేస్తే తప్పకుండా వ్యత్యాసం కనిపిస్తుంది. ఇదిలావుంటే కొందరు తమను తాము ఫేమస్ చేసుకునేందుకు సర్జరీలను ఆశ్రయిస్తూ, ప్రముఖులను పోలివుండేలా తమను తాము మలచుకుంటున్నారు.

Updated Date - 2022-09-29T14:43:50+05:30 IST