అగాదాలను తలపిస్తూ జాతీయ రహదారి
వాల్మీకిపురం, జూన్ 25: వాల్మీకిపురం పట్టణం గుండా వెళ్లే జాతీ య రహదారి ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. మదనపల్లె నుంచి తిరుపతి వెళ్లే మార్గంలో జాతీయ రహదారిపై అగాదాలను తలపిస్తూ ఏర్పడిన గోతులు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. నిత్యం వాహనాల రాకపోకలు రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ద్విచక్రవాహనాలు ప్రమాదపు అంచున పయనిస్తుండటం గమనార్హం. ఇప్పటికైనా ఎన్హెచ్ అధికారులు చొరవ తీసుకుని జాతీయ రహదారులను రోడ్డు భద్రత దృశ్యా బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాహన చోదకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకముందే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.