భారత్-కివీస్ తొలి టెస్టు డ్రా తర్వాత డబ్ల్యూటీసీలో ఎవరు ఎక్కడ?

ABN , First Publish Date - 2021-12-01T01:08:43+05:30 IST

భారత్-న్యూజిలాండ్ మధ్య కాన్పూరులోని గ్రీన్‌పార్క్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసిన తర్వాత

భారత్-కివీస్ తొలి టెస్టు డ్రా తర్వాత డబ్ల్యూటీసీలో ఎవరు ఎక్కడ?

న్యూఢిల్లీ: భారత్-న్యూజిలాండ్ మధ్య కాన్పూరులోని గ్రీన్‌పార్క్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసిన తర్వాత ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) జాబితాలో భారత్ తన రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది.


2021-23కి సంబంధించి జరుగుతున్న ఈ టెస్టు చాంపియన్‌షిప్‌లో పర్సంటేజ్ పాయింట్లను బట్టి ర్యాంకులను  కేటాయిస్తారు. విజేత జట్టుకు 12 (100 శాతం) పాయిట్లు, మ్యాచ్ టై అయితే 6 (50 శాతం) పాయిట్లు, డ్రా అయితే 4 (33.33) పాయింట్లు కేటాయిస్తారు. స్లో ఓవర్ రేట్ కలిగిన జట్టు ప్రతి ఓవర్‌కు ఒక చాంపియన్‌షిప్ పాయింటును కోల్పోతుంది.


ఈ లెక్కన ఇప్పటి వరకు రెండు సిరీస్‌లు ఆడిన టీమిండియా రెండింటిని డ్రా చేసుకుని ఒక మ్యాచ్‌లో ఓటమి పాలైంది. రెండింటిలో విజయం సాధించింది. ఫలితంగా 30 (50 శాతం) పాయింట్లతో జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.


భారత జట్టు ఖాతాలో రెండు పెనాల్టీ ఓవర్లు కూడా ఉన్నాయి. ఇక, ఈ జాబితాలో శ్రీలంక అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం ఒక సిరీస్ ఆడుతున్న శ్రీలంక ఒక మ్యాచ్‌లో విజయం సాధించి 100 శాతంతో 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో పాకిస్థాన్ ఉంది. ఇప్పటి వరకు ఒక సిరీస్ ఆడిన పాక్ ఒకదాంట్లో ఓడి, మరో దాంట్లో విజయం సాధించింది. ఫలితంగా 50 శాతంతో 12 పాయింట్లు సాధించింది. నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి.


Updated Date - 2021-12-01T01:08:43+05:30 IST