ఉక్రెయిన్, రష్యాతో సహా ఏఏ దేశాల్లో భారత విద్యార్థులు చదువుకుంటున్నారో మీకు తెలుసా?

ABN , First Publish Date - 2022-03-03T14:01:05+05:30 IST

ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది.

ఉక్రెయిన్, రష్యాతో సహా ఏఏ దేశాల్లో భారత విద్యార్థులు చదువుకుంటున్నారో మీకు తెలుసా?

ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ముమ్మరమయ్యింది. ఈ దాడులలో ఇప్పటివరకు చాలా మంది మరణించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపధ్యంలో భారత్‌లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థులను ఇక్కడకు తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలో ఇప్పటికే పలు విమానాలు భారత్‌కు చేరుకున్నాయి. అయితే ఇప్పటికీ పెద్ద సంఖ్యలో భారత విద్యార్థులు ఉక్రెయిన్‌లో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 


ఇదిలావుంటే ఒక్క ఉక్రెయిన్, రష్యాలో మాత్రమే కాకుండా ఏఏ దేశాలలో భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఏడాది అంటే 2021 పార్లమెంటు వర్షాకాల సమావేశంలో, రాజస్థాన్‌కు చెందిన ఎంపీ కిరోరి లాల్ మీనా విదేశాల్లో చదువుతున్న భారత విద్యార్థులకు సంబంధించిన డేటాను ప్రభుత్వం నుంచి కోరారు. ఈ నేపధ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ.. భారతదేశానికి చెందిన ఎంత మంది విద్యార్థులు ఏ దేశంలో చదువుకుంటున్నారో వెల్లడించారు. ఉక్రెయిన్, బల్గేరియా, మొజాంబిక్, పాకిస్థాన్ తదితర అనేక దేశాలు కలుపుకుని మొత్తం 99 దేశాల్లో భారతీయ విద్యార్థులు చదువుతున్నట్లు తెలిపారు. గత ఏడాది జూలైలో విదేశాంగ మంత్రిత్వశాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం 11 లక్షల 33 వేల 749 మంది విద్యార్థులు విదేశాల్లో చదువుతున్నారు. ఈ డేటా 6 నెలల క్రితం నాటిది. ప్రస్తుతం దీనిలో మార్పులు చోటుచేసుకుని ఉండవచ్చు. భారతదేశం నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఇతర దేశాలలో చదువుతున్నట్లు ఈ డేటా వెల్లడించింది. దేశాల వారీగా డేటాను పరిశీలిస్తే.. యూఏఈలో అత్యధిక సంఖ్యలో భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరి సంఖ్య 2,19,000. అదేవిధంగా అమెరికాలో 2,11,930 మంది విద్యార్థులు ఉండగా, కెనడాలో 2,15.720 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 

Updated Date - 2022-03-03T14:01:05+05:30 IST