మీరు జీవితకాలంలో ఎన్ని పదాలు పలుకుతారో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-05-23T16:13:52+05:30 IST

మీరు ఒక రోజులో ఎన్ని పదాలు పలుకుతున్నారనే ఆలోచన మీకెప్పుడైనా..

మీరు జీవితకాలంలో ఎన్ని పదాలు పలుకుతారో తెలిస్తే..

మీరు ఒక రోజులో ఎన్ని పదాలు పలుకుతున్నారనే ఆలోచన మీకెప్పుడైనా వచ్చిందా? మన కబుర్లు ఉదయం మనం కళ్ళు తెరవడంతో మొదలవుతాయి.. మనం కళ్ళు మూసుకునే వరకు అంటే నిద్రపోయే వరకు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం.  తక్కువ మాట్లాడేవాళ్ళు కొందరైతే, మామూలుగా ఉండేవాళ్ళు మరికొందరు. అతిగా మాట్లాడేవారు కొందరైతే, మౌనంగా ఉండలేనంతగా మాట్లాడేరు మరికొందరు. తక్కువ మాట్లాడేవారిలో మీరు కూడా ఒకరు అయ్యే అవకాశం ఉందను కుంటున్నారా? మీరు ఏమీ మాట్లాడకపోయినా, మనసులో ఏదో జరుగుతూనే ఉంటుంది! తక్కువ మాట్లాడేవాళ్ళూ, బయట ఏమీ మాట్లాడకుండా వుండేవారూ ఖచ్చితంగా మనసులో ఏదో ఒకటి చెప్పుకుంటూనే ఉంటారు! మీరు ఒక రోజులో ఎంత మాట్లాడుతున్నారో మీరు గమనించి ఉండకపోవచ్చు. 


మనం ఒక రోజులో ఎన్ని మాటలు మాట్లాడతామనే దానిపై కూడా మన దృష్టి మళ్ళదు. లింక్డ్‌ఇన్ లెర్నింగ్ ఇన్‌స్ట్రక్టర్ జెఫ్ అన్సెల్ రీసెర్చ్ ప్రకారం, ఒక వ్యక్తి ఒక రోజులో కనీసం 7,000 పదాలు పలుకుతాడు. దీనికిమించి మాట్లాడేవారు కూడా ఉంటారు. ఒక వ్యక్తి తన మొత్తం జీవితంలో ఎన్ని మాటలు మాట్లాడి ఉంటాడో ఇప్పుడు ఊహించండి. ఒక వ్యక్తి తన మొత్తం జీవితంలో 86,03,41,500 పదాలు అంటే దాదాపు 86 కోట్ల పదాలు మాట్లాడతాడని తెలిస్తే మీరు ఆశ్చర్యం కలుగుతుంది. బ్రిటిష్ రచయిత, బ్రాడ్‌కాస్టర్ గైల్స్ బ్రాండ్రెత్ రాసిన పుస్తకం.. ది జాయ్ ఆఫ్ లెక్స్‌లో దీనికి సంబంధించిన పలు వివరాలు ఉన్నాయి. ఒక మనిషి తన జీవితకాలంలో మాట్లాడే దాదాపు 86 కోట్ల పదాలతో పోల్చిచూస్తే, ఒక సామాన్యుడు తన మొత్తం జీవితంలో ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీషు డిక్షనరీలోని 20 సంపుటాలను దాదాపు 15 సార్లు చదవగలుగుతాడు. 


Updated Date - 2022-05-23T16:13:52+05:30 IST