ఎవరికెంత కాల్షియం?

ABN , First Publish Date - 2022-01-04T05:30:00+05:30 IST

క్యాల్షియం సప్లిమెంట్ల మీద అవగాహన పెరిగింది. అయితే

ఎవరికెంత కాల్షియం?

క్యాల్షియం సప్లిమెంట్ల మీద అవగాహన పెరిగింది. అయితే క్యాల్షియం మోతాదు వ్యక్తులు, వయసులను బట్టి మారుతుంది. 


 గర్భిణులు, పాలిచ్చే తల్లులు పాలు తాగడంతో పాటు, రోజుకి 2 గ్రాముల క్యాల్షియం సప్లిమెంటు అదనంగా తీసుకోవాలి. 


 ప్రి మెనోపాజ్‌ దశలో (అమెనోరియా) మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ తయారవదు. కాబట్టి రోజుకి ఒకటిన్నర గ్రాముల క్యాల్షియం తీసుకోవాలి. మెనోపాజ్‌కు చేరుకున్న తర్వాత అవసరాన్నిబట్టి ఒకటిన్నర నుంచి 2 గ్రాముల వరకూ క్యాల్షియం తీసుకోవచ్చు. - తీవ్ర రుగ్మత నుంచి కోలుకుంటున్న దశలో కూడా ఎక్కువ క్యాల్షియం అవసరమవుతుంది. 


 అయితే ఎంత క్యాల్షియం అవసరమనేది తెలుసుకోవటం కోసం ఎముకల వైద్యుల చేత పరీక్షలు చేయించుకుని, సూచించిన మోతాదు మేరకు తీసుకోవాలి. ఫ

Updated Date - 2022-01-04T05:30:00+05:30 IST