పార్క్ చేసిన కారులో ఏసీ ఆన్ చేస్తే.. గంటలో ఎంత ఇంధనం ఖర్చవుతుందో తెలిస్తే షాకవుతారు!

ABN , First Publish Date - 2022-01-03T13:41:42+05:30 IST

మీరు ఏసీ ఆన్‌లో ఉంచి, కారును నడిపినప్పుడల్లా..

పార్క్ చేసిన కారులో ఏసీ ఆన్ చేస్తే.. గంటలో ఎంత ఇంధనం ఖర్చవుతుందో తెలిస్తే షాకవుతారు!

కారులోని ఏసీ.. పెట్రోల్ లేదా డీజిల్ సాయంతో పనిచేస్తుందనే విషయం మనకు తెలిసిందే. అయితే ఏసీని ఆన్‌చేసి కారు నడుపుతున్నప్పుడు మైలేజీపై ఏ మేరకు ప్రభావం పడుతుందో తెలుసా? అలాగే కారు పార్క్ చేసినప్పుడు ఏసీని ఆన్‌చేసి ఉంచితే, ఎంత ఇంధనం ఖర్చవుతుందో మీకు తెలుసా? ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం. 

మీరు ఏసీ ఆన్‌లో ఉంచి, కారును నడిపినప్పుడల్లా మైలేజీపై ఆ ప్రభావం పడుతుంది. ఈ రోజుల్లో కారు నడిపేవారంతా ఏసీ ఆన్ చేసిన తర్వాతే డ్రైవ్ చేస్తున్నారు. ఈ చర్య ఇంధన వినియోగాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనేదే ఇక్కడున్న పెద్ద సందేహం. ఏసీ ఆన్‌లో ఉంచి, కారును నడిపినప్పుడు ఇంధనం ఖర్చు ఎంత అవుతుందనేది చాలామంది మదిలో మెదిలే ప్రశ్న.


కారులోని ఏసీ ఎలా పని చేస్తుంది?

కారులోని ఏసీ గురించి చెప్పుకోవాల్సివస్తే.. కారులోని ఏసీ ఆన్‌లో ఉన్నప్పుడు.. అది ఆల్టర్నేటర్ నుంచి పొందిన పవర్ ను వాడుకుంటుంది. ఈ పవర్.. ఇంజిన్ ద్వారా అందుతుంది. ఇంజిన్.. ఇంధన ట్యాంక్ నుంచి ఇంధనాన్ని అందుకుంటుంది. అయితే కారు స్టార్ట్ అయ్యే వరకు ఏసీ కూడా ఆన్ కాదు. ఎందుకంటే ఏసీ కంప్రెషర్‌కు జోడించిన బెల్ట్ ఇంజిన్ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే పనిచేస్తుంది. ఈ విధంగా ఏసీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. అప్పుడు అది సాధారణ ఏసీ మాదిరిగా పనిచేస్తుంది.

కారు మైలేజీని ఎంతవరకూ ప్రభావితం చేస్తుంది?

కారులోని ఏసీ.. మైలేజీపై ఖచ్చితంగా 5 నుండి 7 శాతం వరకూ ప్రభావాన్ని చూపిస్తుంది. ఏసీ.. మైలేజీపై పెద్దగా ప్రభావం చూపదని నిపుణులు చెబుతుంటారు. మీరు కారులోని ఏసీని ఆన్‌చేసి, ప్రయాణిస్తున్నప్పుడు.. అది చాలా రకాలుగా కారుపై ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు మీరు హైవేపై అధిక వేగంతో కారును నడుపుతూ.. కిటికీలు తెరిచి డ్రైవ్ చేస్తే, అది వాహన వేగాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే ఇంధన వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందువల్ల మీరు ఏసీ వేసుకుని.. హైవేపై డ్రైవింగ్ చేస్తుంటే మైలేజ్‌పై ఎక్కువగా ప్రభావం పడదు. 

పార్క్ చేసిన కారులో ఏసీ ఆన్ చేస్తే ఏమవుతుంది?

వివిధ నివేదికల ప్రకారం, 1000 సీసీ ఇంజిన్‌ కలిగిన కారులోని ఏసీని గంట సేపు ఆన్ చేసి ఉంచితే.. దాదాపు 0.6 లీటర్ల పెట్రోల్ ఖర్చవుతుంది. ఇంతే సమయంలో కారులో ఏసీని ఆన్‌చేసి నడుపుతుంటే ఇంధన ఖర్చు దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోల్ వినియోగం 1.2 లీటర్ల వరకు ఉంటుంది. అయితే వాహనం కండిషన్, ఇంజన్, ఏసీ కండిషన్ కూడా ఈ లెక్కలను ప్రభావితం చేస్తుందని గమనించండి.



Updated Date - 2022-01-03T13:41:42+05:30 IST