వార్తాపత్రికలో పెళ్లి ప్రకటన చూసి యువతికి ఫోన్.. చివరకు తన తల్లి ఆరోగ్యం బాలేదంటూ ఆమె చెప్పిన మాటలు విని..

ABN , First Publish Date - 2022-09-22T01:44:07+05:30 IST

ప్రేమ, పెళ్లి పేరుతో యువకులు మోసం చేసినట్లే.. కొన్నిసార్లు యువతులు కూడా మోసాలకు పాల్పడడం అప్పడప్పుడూ జరుగుతుంటుంది. ప్రేమగా మాట్లాడుతూ చివరకు దారుణంగా మోసం..

వార్తాపత్రికలో పెళ్లి ప్రకటన చూసి యువతికి ఫోన్.. చివరకు తన తల్లి ఆరోగ్యం బాలేదంటూ ఆమె చెప్పిన మాటలు విని..
ప్రతీకాత్మక చిత్రం

ప్రేమ, పెళ్లి పేరుతో యువకులు మోసం చేసినట్లే.. కొన్నిసార్లు యువతులు కూడా మోసాలకు పాల్పడడం అప్పడప్పుడూ జరుగుతుంటుంది. ప్రేమగా మాట్లాడుతూ చివరకు దారుణంగా మోసం చేస్తుంటారు. ఇంకొందరు మహిళలు చివరకు హత్యలకు కూడా తెగబడుతుంటారు. మధ్యప్రదేశ్‌లో ఓ యువకుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. వార్తాపత్రికలో పెళ్లి ప్రకటన చూసి యువతికి ఫోన్ చేశాడు. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. చివరకు ఓ రోజు తన తల్లికి అనారోగ్యంగా ఉందంటూ ప్రియుడికి ఫోన్ చేసింది. చివరకు ఆమె నిర్వాకంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్ (Madhya Pradesh) పితంపూర్‌లోని ఫకీర్ మొహల్లా అనే ప్రాంతానికి చెందిన అతుల్ తివారీ అనే యువకుడు చాలా కాలంగా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ  క్రమంలో ఏడాది క్రితం అతడు.. వార్తాపత్రికలో పెళ్లి ప్రకటన (Magazine advertisement) చూశాడు. అందులోని నంబర్‌కు ఫోన్ చేసి, యువతితో పరిచయం పెంచుకున్నాడు. రోజూ ఆమెతో మాట్లాడుతూ దగ్గరయ్యాడు. ఇదిలావుండగా, ఇటీవల ఓ రోజు ప్రియుడికి ఫోన్ చేసి.. తన తల్లికి అనారోగ్యంగా ఉందని, అర్జంట్‌గా డబ్బులు కావాలని అడిగింది. ఆమె మాటలు నమ్మిన యువకుడు.. వెంటనే అడిగిన మొత్తాన్ని పంపించాడు.

కాబోయే భార్యను బయటికి తీసుకెళ్లి.. తాకరాని చోట తాకడంతో పాటూ అందుకు ఒప్పుకోవాలంటూ ఒత్తిడి.. అయినా ఆమె వినకపోవడంతో..


కొన్ని రోజులకు మళ్లీ ఫోన్ చేసి, తన తల్లి చనిపోయిందని.. కర్మకాండ తదితర కార్యక్రమాలు జరిపించాలంటూ డబ్బులు అడిగింది. ఇలా దఫాలుగా మొత్తం లక్షా 7వేల రూపాయలు తీసుకుంది. తర్వాత ఏప్రిల్ నుంచి ఫోన్ స్విచ్చాఫ్ చేసింది. ఎన్నిసార్లు కలవాలని చూసినా అటువైపు నుంచి స్పందన రాలేదు. ఇటీవల ఆమె చెప్పిన అడ్రస్‌కు వెళ్లి విచారింగా.. ఆ పేరుతో అక్కడ ఎవరూ లేరని తెలిసింది. దీంతో చివరకు మోసపోయానని తెలుసుకున్న యువకుడు, పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు బాలికలకు ఇందులో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అతను నాకంటే చిన్నవాడు.. అలా చేశాడంటే ఎవరూ నమ్మరు.. అంటూ లేఖ రాసిన యువకుడు.. తప్పక ఇలా చేయాల్సి వస్తోందంటూ..



Updated Date - 2022-09-22T01:44:07+05:30 IST