నేను 19 ఏళ్ల కాలేజ్ స్టూడెంట్ని. సినిమాల్లో రొమాంటిక్ సీన్లు, ముద్దు సన్నివేశాలు చూసినప్పుడు నా మనసంతా లైంగిక ఆలోచనలతో నిండిపోతోంది. అప్పుడు అభిమాన హీరోలతో సన్నిహితంగా గడుపుతున్నట్టు ఊహించుకుని సంతృప్తి పడుతూ ఉంటాను. ఈ ఆలోచనలతో చదువు మీద ధ్యాస తగ్గుతోంది. అసలు ఇదేమైనా జబ్బా? ఇలాంటి భావనల్ని ఎలా నియంత్రించుకోవాలి?
యవ్వనంలో సెక్స్ గురించిన ఆలోచనలు కలగటం అత్యంత సహజం. ఇలా అందరికీ జరుగుతుంది. అయితే ఎప్పుడూ సెక్స్ గురించే ఆలోచిస్తూ ఉండటం మాత్రం కరెక్ట్ కాదు. అలా ఆలోచించేకొద్దీ అవే ఆలోచనలు పదేపదే కలుగుతూ ఉంటాయి. దాంతో కోరిక పెరిగి మీరేం పని చేస్తున్నా బ్యాక్గ్రౌండ్లో ఆ ఆలోచనలు నడుస్తూనే ఉంటాయి. సెక్స్ ఆలోచనలను నియంత్రించటానికి ఈ మార్గాలను అనుసరించండి.
లైంగిక ఆలోచనల్ని ప్రేరేపించే అంశాలు ఎన్నో ఉంటాయి. వాటిని గుర్తించి ఆ అవకాశాలను నియంత్రించగలిగితే సెక్స్ థాట్స్ తగ్గుతాయి. ఒత్తిడి, పదే పదే సెక్స్ గురించి ఆలోచించటం లైంగిక ఆలోచనలకు ప్రధాన ప్రేరేపణలు. కాబట్టి వాటికి దూరంగా ఉండండి.
విల్ పవర్ పెంచుకోండి. నిజంగానే సెక్స్ గురించి ఆలోచించకుండా ఉండాలనుకుంటే మీకు మీరే ఓ ఒప్పందం చేసుకోండి. దానికి కట్టుబడి ఉండండి.
సెక్స్ గురించి ఆలోచించే సమయాన్ని ఏదైనా క్రియేటివ్ పనికి కేటాయించండి. రాయటం, చదవటం, పెయింటింగ్, స్కల్ప్టింగ్, సంగీతం వినటం, ఆటలాడటం... ఇలా ఇష్టమైన అభిరుచి వైపు మనసు మళ్లించండి.
ఒకవేళ ఇలాంటి హాబీలకు అనువైన ప్రదేశంలో రోజులో ఎక్కువ సమయం గడిపే పనైతే చేసే పని మీద మనసు పెట్టండి. చేస్తున్న పని మీద ఇష్టం పెంచుకుంటే వేరే విషయాల మీదకు మనసు వెళ్లదు.
ఖాళీ సమయం లేకుండా చూసుకోండి. ఖాళీ దొరికితే మనసు పరిపరివిధాల పోతుంది. కాబట్టి ఆ అవకాశం దొరక్కుండా రోజంతటినీ వీలైనన్ని ఎక్కువ యాక్టివిటీ్సకు కేటాయించండి.
డాక్టర్ షర్మిల మజుందార్
కన్సల్టెంట్ సెక్సాలజిస్ట్
రామయ్య ప్రమీల హాస్పిటల్
ఝజీజూజీ77ఃజఝ్చజీజూ.ఛిౌఝ