Party on the lips.. అధరపు సొగసు చూడతరమా...

ABN , First Publish Date - 2022-07-29T20:44:54+05:30 IST

అధర సౌందర్యాన్ని ఎల్లప్పుడూ కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. వీటి కేర్ కోసం సరైన స్కిన్ టోన్ కి నప్పే లిప్ స్టిక్ ను ఎంచుకోవడంతోపాటు మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా అవసరం అంటున్నారు నిపుణులు.

Party on the lips.. అధరపు సొగసు చూడతరమా...

అందమైన చిన్నదాని కళ్ళెంత మత్తైనవో అధరాలు అంత సుందర సుమధురాలు అనాలంటే.. ఎర్రని పెదవులు చిరునవ్వులు చిందిస్తూ ఆకర్షించాలి. మరి అధర సౌందర్యాన్ని ఎల్లప్పుడూ కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. వీటి కేర్ కోసం సరైన స్కిన్ టోన్ కి నప్పే లిప్ స్టిక్ ను ఎంచుకోవడంతోపాటు మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా అవసరం అంటున్నారు నిపుణులు అవేంటో చూద్దాం. 


ఏ షేడ్స్ ని ఎంచుకోవాలి.


ఆడవారు మిగతా లిప్ స్టిక్ ఫార్ములాలకన్నా ఎక్కవ సేపు నిలిచి ఉండే లిప్ స్టిక్స్ ను మరీ ఇష్టపడతారు. క్లాసిక్ బ్రైట్ రెడ్స్, పగడాలు, హాట్ పింక్‌ల నుండి న్యూడ్ షేడ్స్ వరకు ఏదైనా ఎంచుకోండి. వాటిని ఎక్కువ సేపు ఉండేలా చేయడానికి లిప్-లైనర్‌ని ప్రయత్నించవచ్చు. లిక్విడ్ మ్యాట్ లిప్‌స్టిక్‌లను అప్లై చేసే ముందు ఎప్పుడూ లిప్ బామ్‌ను ఉపయోగించండి., ఈ సీజన్ కోసం, వాటర్‌ప్రూఫ్, స్మడ్జ్ ప్రూఫ్ ఉండే లిప్‌స్టిక్‌ను ఎంచుకోవడం మంచిది. 


మనం వేసుకుంటున్న లిప్ స్టిక్ ఎక్కువ సమయం కరిగిపోకుండా ఉంటే గొప్ప ప్రోడక్ట్ అని, స్కిన్ టోన్ కి సరిపడే లిప్ స్టిక్ ని ఎంచుకున్నాం అనుకుంటారు. కానీ... లిప్ స్టిక్ ఆకర్షణీయంగా కనిపించడం ఎంత ముఖ్యమో దానిని సరైన సమయంలో రిమూవ్ చేస్తున్నామా అనేది కూడా చాలా అవసరం. 


పెదవుల సంరక్షణకు చిట్కాల కోసం:


సరైన సమయానికి రిమూవ్ చేయకపోవడం అనేది పెదవులకు నష్టాన్ని తెచ్చిపెడుతుందని కాస్మోటిక్ నిపుణులు అంటున్నమాట. 


లిప్ స్టిక్ ను రిమూవ్ చేయడానికి క్లాత్ కన్నా లిప్ స్టిక్ వైప్స్ ను వాడాల్సి ఉంటుంది. 


ఎదుటివారు వేసుకున్న లిప్‌ స్టిక్‌ రంగు బాగుందనో, మంచి బ్రాండ్‌ అని దానినే ఎంచుకుంటే అది మీ చర్మ తత్వానికి సరిపడక పోవచ్చు. 


ఈ వర్షాకాలంలో పెదాలను సుతిమెత్తగా మసాజ్ చేసుకోవడం ముఖ్యం. 


తరచుగా మసాజ్ చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడి సహజమైన పింక్ లిప్స్ మీ సొంతమవుతాయి.


పెదవులను తేమగా ఉంచడానికి ఎల్లప్పుడూ లిప్ బామ్, క్రీమ్ ఆధారిత లిప్‌స్టిక్ లేదా లేతరంగు లిప్ బామ్‌ని ఉపయోగించండి.


రాత్రి అలానే లిప్ స్టిక్ ను వదిలేయడం వల్ల... చర్మంపై మృతకణాలు పేరుకుపోతాయి. 


చవకైన లిప్‌స్టిక్‌ల మాయలో పడవద్దు., వాటిలో ఉండే సీసం,  పెదవుల చర్మానికి చేటు చేస్తుంది. 


కొన్ని ఎలర్జీలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. 


పెదవుల ఛాయకు తేనె, ఓట్స్‌తో స్క్రబ్ చేయండి. ఓట్స్ మృతకణాలను తొలగిస్తుంది, తేనె పెదవులను మృదువుగా ఉండేలా చేస్తుంది.


వెన్న లేదా జొజోబా క్రీమ్ (Jojoba Cream) లేదా ఆలివ్ ఆయిల్‌ని తీసుకొని పెదవులపై సున్నితంగా మసాజ్ చేయడం వల్ల పెదాలు మృదువుగా మారతాయి. 


మీరు ఎంచుకున్న లిప్ స్టిక్  కొత్త అందాన్ని తేవాలంటే జోజోబా ఆయిల్, షియా బటర్ లేదా హైలురోనిక్ యాసిడ్ ఉన్న లిప్‌స్టిక్‌ల కోసం చూడండి, ఇవి పెదాలకు పోషణను, తేమను అందిస్తాయి. పొడి పెదవులు ఉన్నవారు రంగు కోసం నిగనిగలాడే లిప్‌స్టిక్‌ను ఉపయోగించవచ్చు. ఘాటైన లిప్ స్టిక్ పెదవులపై ఉంచి పడుకోవడం వల్ల పెదవులు దెబ్బతింటాయి, త్వరగా ఎండిపోతాయి. పెదవుల చర్మం పొరలుగా ఊడి వచ్చే ప్రమాదం ఉంది. పెదవులు పొడిబారకుండా ఉండాలంటే పడుకునే ముందు హైడ్రేటింగ్ లిప్ బామ్‌ను అప్లై చేయవచ్చు.

Updated Date - 2022-07-29T20:44:54+05:30 IST