ఎలాంటి యాపిల్‌ సిడార్‌ను ఎంచుకోవాలి? దాన్ని ఎలా వాడుకోవాలి?

ABN , First Publish Date - 2022-04-19T18:48:06+05:30 IST

యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌, దాంతో దక్కే ఆరోగ్య ప్రయోజనాల గురించి వింటూ ఉంటాం. కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో మనలో ఎక్కువ మందికి తెలియదు

ఎలాంటి యాపిల్‌ సిడార్‌ను ఎంచుకోవాలి? దాన్ని ఎలా వాడుకోవాలి?

ఆంధ్రజ్యోతి(19-04-2022) 

యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌, దాంతో దక్కే ఆరోగ్య ప్రయోజనాల గురించి వింటూ ఉంటాం. కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో మనలో ఎక్కువ మందికి తెలియదు. ఎలాంటి యాపిల్‌ సిడార్‌ను ఎంచుకోవాలో, దాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం!


ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు: దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది. వ్యాధికారక క్రిముల ప్రభావం తగ్గుతుంది. ఖనిజ లవణాల శోషణ పెరుగుతుంది. కడుపు ఉబ్బరం తగ్గుతుంది. అసిడిటీ తగ్గుతుంది. ప్రొటీన్‌ విచ్ఛిత్తి జరుగుతుంది. వ్యాధినిరోధకశక్తి, మెటబాలిజం పెరుగుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు క్రమం తప్పకుండా ఉంటాయి. 


ఇలా తీసుకోవాలి: 60 మిల్లీలీటర్ల నీళ్లకు రెండు టీ స్పూన్ల వెనిగర్‌ కలిపి తాగాలి. నచ్చితే తేనె, నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. 


ఎలాంటి వెనిగర్‌: శుద్ధి చేయని, సేంద్రీయ యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ను ఎంచుకోవాలి. రా యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌లో జీర్ణశక్తికి తోడ్పడే ఎంజైమ్స్‌ ఉంటాయి. ఈ వెనిగర్‌ పిహెచ్‌ విలువలు 3.3 నుంచి 3.5 మధ్య ఉండేలా చూసుకోవాలి. 

Updated Date - 2022-04-19T18:48:06+05:30 IST