మినిట్‌ పుస్తకం లేకుంటే ఎన్నిక ఎలా నిర్వహించేది

ABN , First Publish Date - 2022-07-01T06:34:57+05:30 IST

మండలంలోని వెలిమినేడు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

మినిట్‌ పుస్తకం లేకుంటే ఎన్నిక ఎలా నిర్వహించేది

ఎన్నికల అధికారి, డైరెక్టర్లు గైర్హాజరు

నిరసన తెలిపిన పాలసంఘం చైర్మన, డైరెక్టర్లు

చిట్యాలరూరల్‌, జూన 30: మండలంలోని వెలిమినేడు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సంఘం చైర్మన ఎన్నిక జరగనునండగా కార్యాలయంలోని మినిట్స్‌ పుస్తకం లేదని వేతన కార్యదర్శి సత్తయ్య చెప్పడంతో ఆయనపై ప్రస్తుత చైర్మన కర్దూరి మల్లారెడ్డి, ఐదుగురు డైరెక్లర్లు గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వర్గం డైరెక్టర్లు మినిట్స్‌ పుస్తకాన్ని తీసుకెళ్లారని చైర్మన ఎన్నికను ఏ రికార్డులో పొందుపరచాలని ఆగ్రహించారు. పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికలను గత నెల 27వ తేదీన నిర్వహించగా బైలా ప్రకారం నిర్వహించలేదని ఎన్నికలు తిరిగి నిర్వహించాలని కలెక్టర్‌కు, డీసీవోకు డైరెక్టర్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల అధికారి వావిలాల ప్రభాకరశర్మ 30వ తేదీన నిర్వహిస్తామని ప్రకటించారు. పాలసంఘం కార్యాలయంలో చైర్మన మల్లారెడ్డి, మారగోని యాదయ్య, దేవిరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, ఏర్పుల నర్సింహ, ఏనుగు చంద్రకళ, మద్దెపురం లింగస్వామిలు హాజరుకాగా మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఎన్నిక అధికారి ఎమ్మెల్యే లింగయ్య వర్గం డైరెక్టర్లు గైర్హాజరైయ్యారు. డీసీవో శ్రీనివా్‌సతో డైరెక్టర్లు సెల్‌ఫోన ద్వారా సంప్రదించగా ఎవరినైనా ఎన్నికల అధికారిగా నియమించుకుని చైర్మనను ఎన్నుకోవచ్చని సూచించారు. ఈ మేరకు వేతన కార్యదర్శిని మినిట్స్‌ పుస్తం ఇవ్వమని కోరారు. మినిట్స్‌ పుస్తకాన్ని మరో వర్గం డైరెక్టర్లు తీసుకెళ్లారని చెప్పడంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలో ఉండాల్సిన రికార్డులు ఇతరులకు ఎలా ఇస్తారని ఎన్నిక ఉందని తెలిసి కూడా ఎందుకు ఇచ్చావని ప్రశ్నించారు. తాను ఇవ్వలేదని వారే తీసుకెళ్లారని వేతన కార్యదర్శి తెలిపాడు. ఎన్నికల అధికారి, మరో నలుగురు డైరెక్టర్ల కోసం మద్యాహ్నం గం. 12 గంటల వరకు వేచి చూడగా వారు రాకపోవడంతో ప్రస్తుత చైర్మన, డైరెక్టర్లు నోటీసులతో కార్యాలయం ఎదుట నిరసనను వ్యక్తం చేశారు. తాము ట్రిబ్యునల్‌కు వెళతామని, కలెక్టర్‌కు, డీసీవోకు ఫిర్యాదు చేస్తామన్నారు. 

 


Updated Date - 2022-07-01T06:34:57+05:30 IST