చాణక్యనీతి: శత్రువును ఓడించే ఈ ఉపాయం ఎంతో శక్తివంతం!

ABN , First Publish Date - 2022-06-11T12:38:32+05:30 IST

ఆచార్య చాణక్య ఆర్థిక శాస్త్రం, దౌత్యం...

చాణక్యనీతి: శత్రువును ఓడించే ఈ ఉపాయం ఎంతో శక్తివంతం!

ఆచార్య చాణక్య ఆర్థిక శాస్త్రం, దౌత్యం, నైతిక శాస్త్రాలలో ఉత్తమ పండితుడు. చాణక్య అనేక గ్రంథాలను రచించాడు. వీటి ఆధారంగా అనేక మంది రాజులు, చక్రవర్తులు దశాబ్దాలుగా తమ పాలన పాలించారు. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో, ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో అతను త్వరగా నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితి వస్తుందని, లేకుంటే అతను తీవ్ర ఇబ్బందుల్లో పడతాడని చెప్పాడు. చాణక్య తన నీతిలో శత్రువును ఓడించడానికి, అతనిపై విజయం సాధించడానికి చాలా ప్రభావవంతమైన మార్గాలను అందించాడు. చాణక్యుడి ఈ పద్ధతులను అవలంబించడం ద్వారా ఎవరైనాసరే శత్రువుపై విజయం సాధించవచ్చు. 


ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం శత్రువులతో నిరంతరం పోరాడుతూ నిలబడటం తెలివైన పని కాదు. శత్రువు బలవంతుడైనప్పుడు వెనక్కి తగ్గడం మంచిది. ఆ తర్వాత సరైన సమయం కోసం వేచి చూడాలి. ఈ సమయాన్ని సొంత శక్తిని పెంచుకోవడానికి వెచ్చించాలి. ఈ సమయంలో శ్రేయోభిలాషులను సమకూర్చుకోవడంతో పాటు, తగిన వ్యూహాన్ని రూపొందించుకోవాలి. పూర్తి స్థాయిలో సిద్ధం అయ్యాక శత్రువును తరిమికొట్టే ప్రయత్నం చేయాలి. ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం ఎవరైనా సరే శత్రువును బలహీనునిగా భావించకూడదు. అతని ప్రతి కదలికను గమనించాలి. అతని బలహీనతలను కనుక్కోవాలి. ఎందుకంటే బలమైన శత్రువును అతని బలహీనతల ఆధారంగానే ఓడించవచ్చు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత ఉంటుంది, అందుకే శత్రువు కదలికలపై నిఘా ఉంచాలి. సమయం వచ్చినప్పుడు అతన్ని ఓడించాలి. విజయం సాధించిన ప్రతి వ్యక్తికి శత్రువుల బెడద ఏర్పడుతుందని ఆచార్య చాణక్య తెలిపారు. ఈ శత్రువులలో మనకు తెలియని శత్రువులు కూడా ఉంటారు. ఇలాంటివారు రహస్యంగా ఉంటూనే దాడి చేస్తారు. అలాంటి శత్రువులు ప్రాణాంతకంగా పరిణమిస్తారు. వారిని గుర్తించడానికి ఎంతో జాగ్రత్త వహించాలి. శత్రువు ప్రతి కదలికను స్థైర్యంతో ఎదుర్కోవాలి.

Updated Date - 2022-06-11T12:38:32+05:30 IST