వాల్‌ హ్యాంగింగ్స్‌ ఎలా పెంచాలంటే!

ABN , First Publish Date - 2021-05-03T06:10:31+05:30 IST

వాల్‌ హ్యాంగర్స్‌ ఇంటికి కళ తెస్తాయి. చూడచక్కగా, పలు రంగుల్లో వీటిని పెంచడానికి ఏం చేయాలంటే... ప్లాంటరీ బాక్స్‌ను నేరుగా టెర్రస్‌ మీద ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ముందుగా ఇంజనీర్లతో లీఫ్‌ రూట్‌ చేయించుకోవాలి...

వాల్‌ హ్యాంగింగ్స్‌ ఎలా పెంచాలంటే!

వాల్‌ హ్యాంగర్స్‌ ఇంటికి కళ తెస్తాయి. చూడచక్కగా, పలు రంగుల్లో వీటిని పెంచడానికి ఏం చేయాలంటే... ప్లాంటరీ బాక్స్‌ను నేరుగా టెర్రస్‌ మీద ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ముందుగా ఇంజనీర్లతో లీఫ్‌ రూట్‌ చేయించుకోవాలి. దీనిని డ్రిప్‌ వర్క్‌ అంటాం. ఉదాహరణకు బోగన్‌విల్లియా తీసుకుంటే... జియోటెక్ట్స్‌టైల్‌ క్లాత్‌ రూ.350కి మీటర్‌ దొరకుతుంది. దానిపైన ఎగ్‌ ట్రేలాంటి షీట్‌లో కోకోపిట్‌, మట్టి, ఇసుక వేసి మొక్కలను పెంచితే స్లాబ్‌ మీద బరువు తక్కువ పడుతుంది. 


  1. వర్మీనా, క్రైసాంథిమమ్‌, లాంటనా, వడేలియా వంటి మొక్కలు ఇంటి ముందు అలంకరణకు కొత్త అందం తెస్తాయి. ఇంటి ముందు శాశ్వత గార్డెన్‌ ఉండాలనుకుంటే కుండీల బదులు ప్లాంటరీ బాక్స్‌ పెంచాలి. గార్డెన్‌ రాత్రిపూట మరింత సుందరంగా కనిపించాలంటే వొలాక్స్‌ లైటింగ్‌ పెట్టించాలి. వీటిలో ఉన్న సౌకర్యం ఏమంటే వెలుతురు మన కంటికి కాకుండా గార్డెన్‌ మీదనే పడుతుంది. గెట్‌ టు గెదర్‌ పార్టీలకు అనువుగా ఉంటుంది. 
  2. చాలామంది టెర్రస్‌ గార్డెన్‌ అంటే పూల మొక్కలే కాదు లాన్‌ కూడా పెంచవచ్చు. కొరియన్‌ కార్పెట్‌ గ్రాస్‌ అంటారు. మొదట యాంటీ లీఫ్‌ ఫ్రూవ్‌ చేయాలి. ఎల్‌డీ, హెచ్‌డీ ప్లాస్ట్‌తో తయారైన ఎగ్‌ ట్రేలు వీటిని డ్రైయింగ్‌ సెల్స్‌ అంటారు. వీటిపైన జియోటెక్స్‌టైల్‌ క్లాత్‌ వేయాలి. ఎక్కడ నీళ్లు లీక్‌ అవలేదని నిర్ధారించుకున్న మూడు రోజుల తరువాత తరువాత ఈ ఎగ్‌ ట్రేలను నేరుగా స్లాబ్‌ మీద వేయాలి. దానిపైన జియోటెక్ట్స్‌ క్లాత్‌ వేసి దీని మీద కోకోపీట్‌, ఎర్రమట్టి, ఇసుక వేయాలి. జియోటెక్స్‌టైల్‌, ఎగ్‌ ట్రేల మధ్య గ్యాప్‌ ఉండడం వల్ల స్లాబ్‌ దెబ్బతినదు. వారానికి రెండుసార్లు మాత్రమే నీళ్లు పోయాలి. 
  3. ఈ లాన్‌ ఒక చదరపు అడుగుకు రూ.20 ఉంటుంది. ప్రొఫెషనల్స్‌ అయితే రూ.30 తీసుకుంటారు. కొరియన్‌ కార్పెట్‌ గ్రాస్‌  వేయడం వల్ల ఉన్న సౌకర్యం ఏమంటే భవిష్యత్తులో వీటిని సులభంగా తొలగించి నిర్మాణం చేపట్టవచ్చు. 
  4. టెర్రస్‌ గార్డెన్‌లో చిన్న నీటి కొలను ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుంది. టెర్రస్‌ మీద ఈశాన్యంలో వాటర్‌ లిల్లీని పెంచితే చూడముచ్చటగా కనిపిస్తుంది. 
  5. దీర్ఘచతురస్రం, చతురస్రాకారంలో హ్యాంగింగ్‌ పాట్స్‌ దొరకుతాయి. వీటిని హుక్స్‌ అంటారు. వీటికి డ్రైయింగ్‌ సెల్‌ కూడా విడిగా ఉంటుంది. వీటికి ఉన్న సెన్సార్‌ను ఫోన్‌కు బ్లూటూత్‌, వైఫైతో కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఒక్క కుండీ ధర 18 వేల నుంచి 35 వేలు ఉంటుంది. నీరు ఎక్కువ అయినప్పుడు మూడు గంటల ముందే సంకేతాన్ని ఇస్తుంది. లెచ్యుసా, ప్లాటినా కంపెనీల కుండీలు 5 ఏళ్ల వరకు మన్నుతాయి. అయితే వీటిని ఎక్కువగా కార్పొరేట్‌ కంపెనీలు ఎంచుకుంటాయి. 

- కె.పి.రావు

ప్రముఖ ల్యాండ్‌స్కేప్‌, ఇంటీరియర్‌ డిజైనర్‌ 

ఫోన్‌ : 8019411199


Updated Date - 2021-05-03T06:10:31+05:30 IST