చాణక్యనీతి: నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని గుర్తుంచుకోండి!

ABN , First Publish Date - 2022-06-26T12:29:04+05:30 IST

ఆచార్య చాణక్యుడు భోజనానికి అరగంట...

చాణక్యనీతి: నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని గుర్తుంచుకోండి!

ఆచార్య చాణక్యుడు భోజనానికి అరగంట ముందు నీటిని తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని చెప్పారు. దీంతో శరీరానికి బలం చేకూరుతుంది. అదే సమయంలో భోజనం మధ్య కొద్దిగా నీరు తాగడం అమృతం లాంటిది. భోజనం పూర్తిచేసిన వెంటనే నీరు తాగకూడదు. ఇలా చేస్తే శరీరంలో అనేక రకాల వ్యాధులు తలెత్తుతాయి. పాలు తాగే వ్యక్తి దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటాడు. 


ఆరోగ్యంగా ఉండటానికి ప్రతీవారు తమ ఆహారంలో సమతుల్యతను కాపాడుకోవాలి. ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో సహజ ఔషధాలను ఉత్తమమైనవిగా పరిగణించాడు. పలు వ్యాధుల నివారణకు, ఇన్ఫెక్షన్ నుండి దూరంగా ఉండటానికి తిప్పతీగ దివ్యౌషధం అని తెలిపారు. పాలు కంటే మాంసం 10 రెట్లు ఎక్కువ పోషకయుక్తమని తెలిపారు. మాంసం, చేపల కంటే నెయ్యి తీసుకోవడం చాలా ప్రయోజనకరమని ఆచార్య చాణక్య సూచించారు. 

Updated Date - 2022-06-26T12:29:04+05:30 IST