UAE వెళ్తున్నారా? అక్కడ ఇలా చాలా ఈజీగా SIM Card తీసుకోండి!

ABN , First Publish Date - 2022-07-16T13:56:43+05:30 IST

ఉద్యోగం, వ్యాపారం, పర్యటన.. ఇలా చాలా కారణాలతో ప్రతి రోజు వందలాది మంది భారతీయులు యూఏఈకి వెళ్తూ ఉంటారు. ఇలా వెళ్లిన వారిలో చాలా మందికి అక్కడ సిమ్ కార్డును ఎలా పొందాలో తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటారు. నిజానికి యూఏఈ SIM Cardను చాలా ఈజీగా పొందొచ్చు. అదెలా అనుకుంటున్నారా..

UAE వెళ్తున్నారా? అక్కడ ఇలా చాలా ఈజీగా SIM Card తీసుకోండి!

ఎన్నారై డెస్క్: ఉద్యోగం, వ్యాపారం, పర్యటన.. ఇలా చాలా కారణాలతో ప్రతి రోజు వందలాది మంది భారతీయులు యూఏఈకి వెళ్తూ ఉంటారు. ఇలా వెళ్లిన వారిలో చాలా మందికి అక్కడ సిమ్ కార్డును ఎలా పొందాలో తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటారు. నిజానికి యూఏఈ SIM Cardను చాలా ఈజీగా పొందొచ్చు. అదెలా అనుకుంటున్నారా.. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్దాం పదండి.



యూఏఈలోని టెలికాం సంస్థలు.. పర్యాటకులకు విజిటర్ లైన్లను అందిస్తున్నాయి. ఉదహరణకు Etisalat వంటి టెలికాం సంస్థలు.. కేవలం పాస్‌పోర్ట్ ఆధారంగా సిమ్ కార్డును ఇస్తున్నాయి. టెలికాం సంస్థల కార్యాలయాలను సందర్శించి.. సంబంధిత డాక్యుమెంట్లతో సులభంగా సిమ్ కార్డు పొందొచ్చు. ఇలా తీసుకున్న SIM Card సుమారు 90 రోజుల వరకు వినియోగంలో ఉంటుంది. యూఏఈలోని పర్యాటక ప్రాంతాలను విజిట్ చేయడానికి వెళ్లే టూరిస్ట్‌లు విజిటర్ లైన్ సేవలను వినియోగించుకోవచ్చు. మరి.. విజిటర్ వీసాలపై కాకుండా ఉద్యోగం, వ్యాపారం, అక్కడ స్థిరపడేందుకు యూఏఈ వెళ్లే వాళ్ల పరిస్థితి ఏంటి. అక్కడ ప్రీపెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డులను పొందడం ఎలా అని ఆలోచిస్తున్నారా. ఇతర వీసాలపై యూఏఈకి వెళ్లిన వాళ్లు కూడా తొలుత ఈ విజిటర్ లైన్ సేవలను వినియోగించుకోక తప్పదు. ప్రీపెయిడ్, పోస్ట్‌ పెయిడ్ సిమ్ కార్డులు పొందాలంటే.. నిబంధనల ప్రకారం.. ఎమిరేట్స్ ఐడీ‌తో దానికి అనుబంధ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. యూఏఈలో ల్యాండ్ అవగానే.. ఎమిరేట్స్ ఐడీ లభించదు. అందువల్ల.. మనకు ఎమిరేట్స్ ఐడీ వచ్చే వరకు తాత్కాలికంగా విజిటర్ లైన్‌ను వినియోగించుకోవాలి. ఎమిరేట్స్ ఐడీ పొందిన తర్వాత విజిటర్‌ లైను ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ నెంబర్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు. 


Updated Date - 2022-07-16T13:56:43+05:30 IST