నిరోధకత పెరగాలంటే.. ఎవరు ఏం తినాలి

ABN , First Publish Date - 2020-06-24T16:32:33+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా కుటుంబ సభ్యులందరూ ఎక్కువ సేపు కలిసి ఉండడం, పెద్దగా కాలక్షేపం లేకపోవడంతో నచ్చిన ఆహార పదార్థాలు ఇంట్లో వండించుకోవడం బాగా పెరిగింది. అయితే ఎక్కువ తినేస్తున్నామన్న ఆందోళన చాలామందిలో కనిపిస్తోంది. ‘‘నిజానికి ఇది రోగ నిరోధక

నిరోధకత పెరగాలంటే.. ఎవరు ఏం తినాలి

ఆంధ్రజ్యోతి(24-06-2020)


కరోనా డైట్‌

లాక్‌డౌన్‌ కారణంగా కుటుంబ సభ్యులందరూ ఎక్కువ సేపు కలిసి ఉండడం, పెద్దగా కాలక్షేపం లేకపోవడంతో నచ్చిన ఆహార పదార్థాలు ఇంట్లో వండించుకోవడం బాగా పెరిగింది.   అయితే ఎక్కువ తినేస్తున్నామన్న ఆందోళన చాలామందిలో కనిపిస్తోంది. ‘‘నిజానికి ఇది రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సిన సందర్భం’’ అంటున్నారు న్యూట్రిజోన్‌ సంస్థ వ్యవస్థాపకురాలు, పోషకాహార నిపుణురాలు ముత్తులక్ష్మి. కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న పిల్లలూ, వయోధికులతో పాటు పెద్దల  తీసుకోవాల్సిన ఆహార సూచనలు చెబుతున్నారిలా...


చిన్నారుల కోసం ...

మాంసం, చేపలు:  చికెన్‌, మటన్‌, చేపలు... వీటిలో అధికశాతం ప్రోటీన్స్‌ ఉంటాయి.  కణజాలాన్ని మరమ్మతు చేసుకోవడంలో, తెల్లరక్తకణాలు పెరగడంలో  ప్రోటీన్లు సహాయపడతాయి. మాంస ఉత్పత్తులలో విటమిన్‌ - బి, జింక్‌, ఐరన్‌ అధికంగా ఉంటాయి. ఇవన్నీ రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి.


యోగర్ట్‌ : చిన్నారుల పేగులను యోగర్ట్‌ బలోపేతం చేస్తుంది. జీర్ణకోశ అనారోగ్యాలను నివారిస్తుంది. దీనిలోని ప్రోబయాటిక్స్‌ చెడు బ్యాక్టీరియాతో పోరాడతాయి.


నట్స్‌: వీటిలో విటమిన్‌-ఇ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇవి శరీరానికి ఇమ్యూన్‌ బూస్టర్‌గానూ, యాంటీ ఆక్సిడెంట్స్‌గానూ ఉపకరిస్తాయి.


ఆకు కూరలు: క్యాబేజీ, బ్రోకోలీ, పాలకూర లాంటి ఆకు కూరలన్నిటితో పాటు టొమాటోలోనూ అనేక పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. వీటిలోని బీటా కెరోటిన్‌, ఇతర కెరోటినాయిడ్స్‌ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.


వయోధికులకు...

సీనియర్‌ సిటిజన్లలో చాలామందికి మధుమేహం, రక్తపోటు, ఆస్తమా లాంటి వ్యాధులు ఉంటాయి. వారి శరీరం ప్రొటీన్‌ను తక్కువగా ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి వారికి సప్లిమెంట్స్‌ అవసరమవుతాయి. వీరు తినాల్సినవేమంటే...


గుడ్లు: కోడిగుడ్లలోని తెల్లసొనలో ప్రొటీన్‌ ఎక్కువగా ఉంటుంది. కణజాలం మరమ్మతుకు ఇది తోడ్పడుతుంది. శాకాహారులు తక్కువ కొవ్వు ఉన్న పాల నుంచి తయారుచేసిన పనీర్‌ వాడడం మంచిది.


చికెన్‌: ఇతర మాంసపదార్థాలతో పోలిస్తే చికెన్‌లో ప్రోటీన్‌ అధికం. కొవ్వు తక్కువ. అలాగే చికెన్‌లో ఉండే నియాసిన్‌, సెలీనియంలకు కేన్సర్‌తో పోరాడే గుణాలున్నాయి.


అన్నం: ఇది క్లిష్టమైన కార్బోహైడ్రేట్‌. నెమ్మదిగా అరగడంతో పాటు శరీరం ఎక్కువసేపు శక్తిని వినియోగించుకోగలుగుతుంది. రైస్‌లో సోడియం పరిమాణం తక్కువ. పొటాషియం, బి- విటమిన్స్‌ తగు మోతాదులో ఉంటాయి. అన్నంలో కొవ్వు నామమాత్రమే. కొలెస్ట్రాల్‌ కూడా ఉండదు. గ్లుటెన్‌ రహితం కావడం వల్ల ఉదర కుహరానికి సంబంధ వ్యాధులు ఉన్నవారికి ఉపయుక్తం కూడా.


యోగర్ట్‌ : యోగర్ట్‌లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఆస్టియోపోరోసిస్‌ (ఎముకలు గుల్లబారే వ్యాధి) నివారణకు ఇది తోడ్పడుతుంది. జీర్ణసంబంఽధ వ్యాధులు ఉన్నవారికి కూడా ఉపయుక్తం. 


పెద్దలకు...

గుడ్లు : రోగ నిరోధక శక్తి వృద్ధి చెందడానికి తగినంతగా ప్రొటీన్‌ తీసుకోవడం అవసరం. గుడ్లు ఇందుకు బాగా తోడ్పడతాయి. విటమిన్‌- డి, జింక్‌, సెలినియం, విటమిన్‌- ఇ లాంటి పోషకాలు వీటిలో లభిస్తాయి. 


చికెన్‌: చికెన్‌లో విటమిన్‌- బి6 అధికంగా ఉంటుంది. ఎర్ర రక్తకణాలు ఏర్పడేందుకు ఇది తోడ్పడుతుంది. చికెన్‌లో లివర్‌ తినడం వల్ల అదనంగా ఐరన్‌, జింక్‌ లభిస్తాయి.


పాలకూర (స్పినాచ్‌): రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి విటమిన్‌-ఎ అవసరం. పాలకూరలో  బీటా కెరోటిన్‌ లభిస్తుంది. ఆకు కూరలలో ఫోలెట్‌ లాంటివి అధికంగా ఉంటాయి. ఆకుకూరలు తినడం ఇష్టం లేనివారు గ్రీన్‌, లేదంటే ఆరెంజ్‌ రంగుల్లో ఉండే కూరగాయలు తీసుకోవచ్చు. 


బాదం : బాదం పప్పులో విటమిన్‌- ఇ అధికంగా ఉంటుంది. అలాగే మ్యాంగనీస్‌, మెగ్నీషియం, ఫైబర్‌ ఉంటాయి. రోజూ గుప్పెడు బాదం పలుకులు తింటే పలురకాలుగా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

Updated Date - 2020-06-24T16:32:33+05:30 IST