భూసారం తెలుసుకునేదెలా..?

ABN , First Publish Date - 2022-05-12T04:15:00+05:30 IST

జిల్లా రైతులకు భూసార ఫలితాలు తెలుసుకోవడం ఒక పరీక్షే. జిల్లాలో భూ విస్తీర్ణానికి అనుగుణంగా పరీక్ష కేంద్రాలు లేక పోవడంతో ఇబ్బం దులు తప్పడం లేదు. రైతులకు భూముల స్వభావం, వాటిలో సాగు చేయాల్సిన పంటలు వాడాల్సిన ఎరువులపై సూచనలిచ్చి, లాభాల బాటలో నడిపించాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించింది. దీంతో పోషకాల అవసరం తెలియక రైతులు నష్టపోతున్నారు.

భూసారం తెలుసుకునేదెలా..?
జిల్లా కేంద్రంలో మూతపడిన భూసార పరీక్ష కేంద్రం

- మూతపడిన జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రం

- మూలనపడ్డ మినీ ల్యాబ్‌లు

- జిల్లాలో వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం

- మట్టి పరీక్షలు నిర్వహించాలని కోరుతున్న రైతులు

జిల్లా రైతులకు భూసార ఫలితాలు తెలుసుకోవడం ఒక పరీక్షే. జిల్లాలో భూ విస్తీర్ణానికి అనుగుణంగా పరీక్ష కేంద్రాలు లేక పోవడంతో ఇబ్బం దులు తప్పడం లేదు. రైతులకు భూముల స్వభావం, వాటిలో సాగు చేయాల్సిన పంటలు వాడాల్సిన ఎరువులపై సూచనలిచ్చి, లాభాల బాటలో నడిపించాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించింది. దీంతో పోషకాల అవసరం తెలియక రైతులు నష్టపోతున్నారు. 

నెన్నెల, మే 11:  జిల్లాలో  భూసార పరీక్షలు నిర్వహించడం లేదు.  మట్టి నమూనాల సేకరణలో యంత్రాంగం చిత్తశుద్ధి కొరవడింది. మట్టి పరీక్షలు నిర్వహించి భూమిలో ఉన్న సారాన్ని బట్టి సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని భూసా ర పరీక్ష కేంద్రం మూసి వేశారు. దీంతో పాటు మండలాల్లోని మినీ ల్యాబ్‌ లు మూలనపడ్డాయి.  మార్చి నెల నుంచే నమూనాలు సేకరించా ల్సి ఉండగా వానాకాలం దగ్గెరపడుతున్న ఇంత వరకు మట్టి నమూనాల సేకరణ ప్రారంభం కాలేదు. ఇప్పటికిప్పుడు మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు చేసినా తొలకరికి ముందే ఫలితాలు అందే పరిస్థితి లేదు.

- పరీక్ష కేంద్రం మూసివేత..

జిల్లా కేంద్రంలోని భూసార పరీక్ష కేంద్రాన్ని మూసివేశారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో కార్యాలయం ఉండేది. ఆ స్థలాన్ని మెడికల్‌ కాలేజీకి కేటాయించారు. ఆఫీస్‌ సామగ్రి, యంత్రాలు, రసాయనాలను అక్కడి నుంచి సీతారాంపల్లిలోని రైతు వేదికకు తరలించారు. ముగ్గు రుసిబ్బందిని జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయానికి కేటాయించారు. దీంతో పరీక్ష కేంద్రం మూతపడింది. మండలాల్లోని మినీ ల్యాబ్‌లు కూడా నిర్వాహణ లేక నిరుపయోగంగా మారాయి. నాలుగేళ్ల కిందట 55 క్లస్టర్లలో మినీ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. 71.50 లక్షల రూపాయలు వెచ్చించి భోపాల్‌లోని భారత వ్యవసాయ పరిశోధన మండలి  రూపొం దించిన మినీ కిట్లు పంపిణీ చేశారు. కిట్లతో పాటు 150 పరీక్షలకు సరిపడ రీఏజెంట్లను మాత్రమే సరఫరా చేశారు. ఆ తర్వాత రసాయనాల సప్లై లేక పోవడంతో కిట్లు నిరుపయోగంగా మారాయి. గతంలో మండలాల్లో వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో మట్టి నమూనాలు నిల్వ చేయడం, ల్యాబ్‌ కోసం స్థల భావంతో పరీక్షలు చేసేందుకు కష్టంగా ఉండే ది. ప్రస్తుతం సర్వాంగ సుందరంగా నిర్మించిన రైతు వేదికల్లో పరీక్షలు నిర్వహించుకోవచ్చు. క్లస్టర్లకు  రసాయనాలు సరఫరా చేసి శిక్షణ పొందిన సిబ్బందిని నియమిస్తే మినీ కిట్లు ఉపయోగం లోకి వస్తాయి. 

- యేటా మార్చి నుంచి..

 పొలాల్లోని మట్టి సారాన్ని అంచనా వేయడానికి యేటా మార్చి నుంచి మే నెల ఆఖరు  వరకు పొలాల్లోని మట్టిని వ్యవసాయశాఖ సిబ్బంది సేకరిస్తుంటారు. ల్యాబ్‌లకు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించి వానాకాలం సీజన్‌ కంటే ముందు ఫలితాలను అందజేస్తారు. వచ్చిన ఫలితాలను బట్టి నేలలో ఏ రకమైన పంటలు వేయడానికి అనుకూలంగా ఉన్నాయి.. ఏ రసాయనాలు వాడాలన్నది కూడా వ్యవసాయ శాఖ వారే సూచిస్తారు. ఆ ప్రకారం రైతులు వ్యవహరిస్తే పొలాల్లో అధిక దిగుబడులు సాధించవ చ్చు.  మట్టి నమూనాల సేకరణకు అదను దాటి  పోతున్నప్పటికీ అధికా రుల్లో చలనం లేదని రైతులు చెబుతున్నారు.

- పరీక్షలు చేయక నేల నిస్సారం..

పంటల దిగుబడి అనేది ప్రధానంగా నేలసారం, సాగుచేసే రకం, యాజమాన్య పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. దీంట్లో కీలక భూమిక పోషించేంది మట్టిలోని పోషక విలువలు. నేలలో సహజ సిద్ధంగా అనేక పోషకాలు ఉంటాయి. వీటి స్థితి గతులను అంచనా వేయకుండా పదే పదే రసాయన ఎరువులను విచ్చలవిడిగా వాడడం వల్ల సాగుఖర్చు పెరిగిపోవడమే కాకుండా భూమి నిస్సారంగా మారుతుంది. మొక్క ఆరోగ్యంగా ఉండేందుకు సాధారణంగా 16 రకాల పోషకాలు అవసరం అవుతాయి. రైతులు, నత్రజని, భాస్వరం, పొటాష్‌ లాంటి పోషకాలను మాత్రమే వాడుతున్నారు. మిగతా పోషకాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ క్రమంలో సాగు భూముల్లోని మట్టిలో సమతూల్యత దెబ్బతింటోంది.  ఏళ్లతరబడి ఇలాగే విచక్షణ రహితంగా రసాయనాలు వాడితే మట్టి తన భౌతిక లక్షణాలు కోల్పోయి పంటలు పండని పరిస్థితులు వస్తాయి. రాబో యే కాలంలో ఆహారానికి కొరత ఏర్పడడంతో పాటు వ్యవసాయం రంగం  సంక్షోభంలో కూరుకుపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


పరీక్ష కేంద్రాలు అందుబాటులో లేవు..

- ఆనందపు రాజన్న, రైతు, ఆవడం, నెన్నెల మండలం

పరీక్ష కేంద్రాలు అందుబాటులో లేక  చాలా మంది రైతులు  భూసార పరీక్షలు చేసుకోవడం లేదు.  రైతుల భూముల్లో ఏఏ పోషకాలున్నయో భూసార పరీక్షల ద్వారా తెలుసుకున్న ఫలితాల మేరకు మోతాదుగా ఎరు వులను వాడితే సమతుల్యం వస్తుంది.  ఎక్కువ మంది రసాయనికి ఎరు వులు విచ్చలవిడిగా వాడి నేలలను నిర్వీర్యం చేసుకుంటున్నారు. అధికా రులు భూసార పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలి.


 పదిరోజుల్లో పునః ప్రారంభిస్తాం

-జి కల్పన, జిల్లా వ్యవసాయశాఖ అధికారి 

జిల్లా కేంద్రంలోని భూసార పరీక్ష కేంద్రాన్ని పది రోజుల్లో పునఃప్రా రంభిస్తాం. ఇన్నాళ్లు కార్యాలయం కొనసాగిన స్థలాన్ని వైద్య కళాశాలకు కేటాయిం చడంతో పరీక్ష కేంద్రాన్ని మూసివేయాల్సి వచ్చింది. కలెక్టర్‌కు నూతన భవనం కోసం ప్రతిపాదనలు పంపించాం. భవనాన్ని సమకూ ర్చిన వెంటనే భూసార పరీక్షలు మొదలు పెడతాం. మండల కేంద్రాల్లో, క్లస్టర్లలోని  మినీ కేంద్రాలకు సరఫరా చేసిన రీజిజెంట్స్‌ అయిపోయాయి. రసాయనాల  సరఫరా లేక పోవడంతో మినీ కేంద్రాల్లో పరీక్షలు చేయడం లేదు. ప్రస్తుతం భూసార పరీక్షలు చేసుకోవాలనుకునే రైతుల మట్టి నమూనాలను సేకరించి ఆదిలాబాద్‌ తీసుకెళితే చేస్తారు. 

Read more