తాజా నెయ్యి ఇంట్లోనే...

ABN , First Publish Date - 2020-09-19T17:53:58+05:30 IST

వేడివేడి అన్నంలో పచ్చడితో పాటు కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరు. తీపిపదార్థాల తయారీలోనూ నెయ్యి ఉండాల్సిందే. అయుతే మార్కెట్‌లో కొనే బదులు

తాజా నెయ్యి ఇంట్లోనే...

వేడివేడి అన్నంలో పచ్చడితో పాటు కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరు. తీపిపదార్థాల తయారీలోనూ నెయ్యి ఉండాల్సిందే. అయుతే మార్కెట్‌లో కొనే బదులు ఇంటివద్దనే తాజా, రుచికరమైన నెయ్యి తయారుచేసుకోవచ్చు అంటున్నారు ప్రముఖ చెఫ్‌ సంజీవ్‌ కపూర్‌. 


కావలసినవి: ఫ్యాట్‌మిల్క్‌, యోగర్ట్‌, ఐస్‌కోల్డ్‌ వాటర్‌, ఐస్‌క్యూబ్స్‌.


తయారీ: ముందుగా పాలను పాన్‌లో మీడియం మంట మీద మరిగించాలి. పాలు మరిగిన తరువాత మంట ఆర్పేసి, పాలను చల్లారనివ్వాలి. ఇప్పుడు పాల మీద తెట్టులా తేరుకున్న మీగడను జాగ్రత్తగా ఒక డబ్బాలోకి తీసుకోవాలి. దానిని ఫ్రిజ్‌లో పెట్టాలి.


ఇలా 15 నుంచి 20 రోజుల పాటు పాలు మరిగించి, మీగడను సేకరించాలి. ఇప్పుడు మీగడ ఉన్న డబ్బాను ఫ్రిజ్‌లోంచి బయటకు తీసి అందులోని మీగడను ఒక పెద్ద గిన్నెలోకి మార్చాలి. 


తరువాత యోగర్ట్‌ (మూడు కప్పుల మీగడకు రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున యోగర్ట్‌) వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఆరు లేదా ఎనిమిది గంటలు పక్కన పెట్టాలి. 


ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మరో గిన్నెలోకి తీసుకొని, ఐస్‌కోల్డ్‌ వాటర్‌, ఐస్‌క్యూబ్స్‌ వేయాలి. తరువాత ఎలక్ట్రిక్‌ హ్యాండ్‌ బ్లెండర్‌ సాయంతో మిక్స్‌ చేయాలి. తేలియాడుతున్న తెల్లని మజ్జిగ బుడగలను జాగ్రత్తగా మరొక పాత్రలోకి తీసుకోవాలి. వీటిని నీళ్లతో కడిగి మరొక పాత్రలోకి మార్చాలి. 


తరువాత తెల్లని మజ్జిగ బుడగలను పాన్‌లో చిన్న మంట మీద ఉంచాలి. 45 నిమిషాల తరువాత మంట ఆర్పేసి, మస్లిన్‌ వస్త్రంతో నెయ్యిని వడబోయాలి. ఇలా తయారుచేసుకున్న తాజా నెయ్యిని బిగుతైన మూత ఉన్న సీసాలోకి మార్చాలి. ఈ నెయ్యిని రెండు నెలలు ఉపయోగించుకోవచ్చు. 

Updated Date - 2020-09-19T17:53:58+05:30 IST