పాలు కక్కేస్తే ఎలా?

ABN , First Publish Date - 2022-06-30T09:49:31+05:30 IST

పాలు కక్కేస్తే ఎలా?

పాలు కక్కేస్తే ఎలా?

డాక్టర్‌! మా బాబుకు మూడు వారాలు. ఎటువంటి ఇబ్బందీ లేకుండా పాలు తాగుతున్నా, రోజులో మూడు నుంచి నాలుగు సార్లు పాలు వాంతి చేసుకుంటున్నాడు. ఇది ప్రమాదకర లక్షణమా?

- ఓ సోదరి

రు నెలల లోపు పిల్లలకు పాలు, పెరుగు లాంటి వాంతులు కావడం సహజం. ఈ లక్షణాన్ని ‘గ్యాస్ట్రో ఈసోఫిగల్‌ రిఫ్లక్స్‌’ అంటారు. అన్నవాహికకు, జీర్ణాశయానికి మధ్య ఉండే కండరం వదులుగా ఉండడం మూలంగా పాలు కొంత మేరకు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఆరు నెలల వయసు వరకూ పిల్లల్లో ఈ వ్యవస్థ పూర్తిగా ఎదిగి ఉండదు. కాబట్టి ఇలా పాలు కక్కుకోవడం సహజం. కొంతమంది పిల్లల్లో ఈ సమస్య ఏడాది వరకూ కొనసాగవచ్చు. అయితే ఈ పరిస్థితి ప్రమాదకరమా? కాదా? అని తెలుసుకోవడానికి పిల్లల బరువును గమనించాలి. బిడ్డ బరువు తగ్గకుండా వారానికి 150 గ్రాముల చొప్పున క్రమేపీ బరువు పెరుగుతూ ఉంటే పాలు వాంతి చేసుకుంటున్నా కంగారు పడవలసిన అవసరం లేదు. అయితే కొందరు తల్లులు బిడ్డ ఏడ్చిన ప్రతిసారీ పాలు పట్టించేస్తూ ఉంటారు. ఇలా అవసరానికి మించి పాలు పట్టించినా ఇలా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే సీసా పాలు పట్టించే పిల్లల్లో కూడా ఇలా జరుగుతుంది. కాబట్టి కారణం గమనించాలి. అలాగే పాలు తాగించిన వెంటనే బిడ్డను పడుకోబెట్టకుండా, 10 నిమిషాల పాటు భుజం మీద పడుకోబెట్టి, త్రేన్పు వచ్చేవరకూ వెన్ను తట్టాలి. ఇలా చేసినా పిల్లలు పాలు కక్కేసుకోకుండా ఉంటారు. 


డాక్టర్‌ విజయానంద్‌

పీడియాట్రీషియన్‌ అండ్‌ నియో నాటాలజిస్ట్‌,

 హైదరాబాద్‌.

Updated Date - 2022-06-30T09:49:31+05:30 IST