వేతనాలివ్వకపోతే ఎలా..?

ABN , First Publish Date - 2021-06-23T06:21:48+05:30 IST

సెక్యూరిటీ గా ర్డులు, పారిశు ధ్య కార్మికులకు నెలల తరబడి వేతనాలు ఇవ్వక పోతే ఎలా బ తుకుతారని ఏఐటీయూసీ నా యకులు ఆవేదన వ్యక్తం చేశారు.

వేతనాలివ్వకపోతే ఎలా..?
సూపరింటెండెంట్‌తో వాగ్వాదం చేస్తున్న నాయకులు


సూపరింటెండెంట్‌ వద్ద ఏఐటీయూసీ నేతల ఆవేదన

 అనంతపురం    వైద్యం,   జూన్‌ 22:  సెక్యూరిటీ గా ర్డులు, పారిశు ధ్య కార్మికులకు నెలల తరబడి వేతనాలు ఇవ్వక పోతే ఎలా బ తుకుతారని ఏఐటీయూసీ నా యకులు ఆవేదన వ్యక్తం చేశారు. సెక్యూరిటీ గార్డులు, పారిశుధ్య కార్మికులకు మద్దతుగా మంగళవారం ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు కృష్ణుడు, ప్రధాన కార్యదర్శి రాజే్‌షగౌడ్‌ ఆధ్వర్యంలో జిల్లా సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావును కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలు ఫణంగా పెట్టి, పనిచేస్తున్న వారికి జీతాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. ఏజెన్సీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నా.. అధికారులు మౌనంగా ఎందుకుంటున్నారని ప్రశ్నించారు. వెంటనే జీతాలు మంజూరు చేయించాలనీ, లేకపోతే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తూ వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో  కార్మిక సంఘాల నాయకులు రామాంజనేయులు, శోభ, గంగన్న, అంజలి, శివన్న, వన్నూరు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-23T06:21:48+05:30 IST