ltrScrptTheme3

బాధ్యతలు తెలియకుండా విధులెలా నిర్వహిస్తారు?

Oct 27 2021 @ 00:21AM
గ్రామ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జేసీ సిరి

సచివాలయ సిబ్బందిపై జాయింట్‌ కలెక్టర్‌ సిరి ఆగ్రహం 

గ్రామ కార్యదర్శికి ఇంక్రిమెంట్‌ నిలిపివేయాలని ఆదేశం


వజ్రకరూరు, అక్టోబరు 26: బాధ్యతలు తెలియకుండా విధులు ఎలా నిర్వహిస్తారని సచివాలయ సిబ్బందిపై జాయింట్‌ కలెక్టర్‌ సిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె మండలంలోని కొనకొండ్ల గ్రామ సచివాలయం-1, 2, 3లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేసీ.. మీ బాధ్యత ల గురించి వివరించండి అని సచివాలయ సిబ్బందిని అడగ్గా, వారు బిక్కమొహం వేశారు. మధ్యాహ్న భోజన పథకం, అంగనవాడీ సెంటర్లను తని ఖీ చేస్తున్నారా? అని వెల్ఫేర్‌ అసిస్టెంట్లు, మహిళా పోలీసులను ప్రశ్నించా రు. ఇందుకు వారు లేదని తెలపడంతో కార్యాలయాలకు కబుర్లు చెప్పుకోవడానికి వస్తున్నారా అని మండిపడ్డారు. సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఎంపీడీఓ రెహనాబేగంకు ఆదేశించారు. పర్యవేక్షణ లేకపోవడం, అనుమతులు లేకుండా గైర్హాజరవడం, రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం, పథకాలను సూచించే బోర్డులు ఏర్పాటు చేయకపోవడంలో నిర ్లక్ష్యం వహించిన కారణంగా గ్రామ కార్యదర్శి సుధాకర్‌కు ఇంక్రిమెంట్‌ నిలిపివేయాలని ఆదేశించారు.


ఉపాధి పనుల పరిశీలన 

కేంద్ర బృందం ఈ నెల 28, 29న పర్యటించనున్న నేపథ్యంలో మండలంలోని కొనకొండ్ల గ్రామంలోని ఉపాధి హామీ పనులను జేసీ సిరి మంగళవా రం పరిశీలించారు. గ్రామంలో ఖర్చు చేసిన నిధుల గురించి అధికారులను ఆరా తీశారు. రికార్డులు పరిశీలించారు. మండలంలోని ఎక్కడైనా కేంద్ర బృందం పర్యటిస్తుందన్నారు. ఏ పని గురించి అడిగినా చూపించేలా ఉండాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ వేణుగోపాల్‌ రెడ్డి, ఏపీడీ విజయలక్ష్మి, ఎంపీడీఓ రెహనాబేగం, ఇన్చార్జి ఏపీఓ ప్రభాకర్‌, పీల్డ్‌ అసిస్టెంట్లు గోవిందు, చుక్కా రాజు, తదితరులు పాల్గొన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.