నా కాపురం నిలబెట్టుకోవడం ఎలా

ABN , First Publish Date - 2020-02-20T05:42:59+05:30 IST

నా వివాహమై పదేళ్లయ్యింది. మాకు ఇద్దరు పిల్లలు. ఒకరినొకరం ఎంతగానో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. అయితే ఈమధ్య తను ఎక్కువసేపు ఫోన్‌లో చాటింగ్‌ చేస్తూ గడుపుతున్నాడు. అర్థరాత్రి

నా కాపురం  నిలబెట్టుకోవడం ఎలా

కుటుంబాలను కూల్చివేసే ఇటువంటి ఆగడాలను వెంటనే అరికట్టాలి. గొడవపడటం అనవసరం. ఇంటికొచ్చాక కుటుంబానికి మాత్రమే సమయం కేటాయించాలని స్పష్టంగా వివరించండి. మీ మాట వినకపోతే పెద్దవారి సాయం తీసుకోండి. అసలు మీ భర్త ఏం కోరుకుంటున్నారో ఎందుకలా చేస్తున్నారో ఆయన నోటివెంట చెప్పిస్తే పరిష్కారం సులభం.


నా వివాహమై పదేళ్లయ్యింది. మాకు ఇద్దరు పిల్లలు. ఒకరినొకరం ఎంతగానో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. అయితే ఈమధ్య తను ఎక్కువసేపు ఫోన్‌లో చాటింగ్‌ చేస్తూ గడుపుతున్నాడు. అర్థరాత్రి అయినా ఫోన్‌ వదలడం లేదు. దాంతో తప్పే అయినా ఆయన ఫోన్‌ చెక్‌ చేశాను. మా సమీప బంధువులైన ఇద్దరు మహిళలతో మాట్లాడుతున్నాడని తెలిసింది. ఈ విషయమై నిలదీస్తే గొడవపడి మాట్లాడటం మానేశాడు. కానీ వాళ్లతో చాటింగ్‌ మాత్రం మానలేదు. వాళ్లూ పెళ్లయి పిల్లలున్నవారే. ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. వాళ్లకు బుద్ధి చెప్పి, నా కాపురం నిలబెట్టుకోవడం ఎలా? ఈ సమస్యలతో నా ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది.     

 శ్రుతి

మీరు చెప్పిన సమస్యలు ఈ రోజుల్లో సాధారణమైపోయాయి. నైతికత అనే పదానికి అర్థాలు మారిపోతున్నాయి. చదువు, సంస్కారం ఎందుకూ పనికిరావడం లేదు. సంసారాన్ని పణంగా పెట్టి మీవారు వేరే వాళ్లతో అర్థరాత్రి వరకు చాటింగ్‌ చేయడం క్షమార్హం కాదు. అయితే అతని దృష్టిలో అదొక సరదా అంతే. అలాగే ఆ మహిళలూ అంతే. వారికి అదొక కాలక్షేప వ్యవహారం. అలాగనీ వారు కలుసుకోవడం, తిరగడం... ఇవేవీ ఉండవు. ముందే చెప్పినట్టు ఇదొక జాఢ్యం. మందులు లేని మానసిక రోగం. కుటుంబాలను కూల్చివేసే ఇటువంటి ఆగడాలను వెంటనే అరికట్టాలి. లేకపోతే సున్నిత మనస్కులైన మీలాంటి వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందుకే గొడవపడటం అనవసరం. ఇంటికొచ్చాక కుటుంబానికి మాత్రమే సమయం కేటాయించాలని స్పష్టంగా వివరించండి. మీ మాట వినకపోతే పెద్దవారి సాయం తీసుకోండి. అసలు మీ భర్త ఏం కోరుకుంటున్నారో ఎందుకలా చేస్తున్నారో ఆయన నోటివెంట చెప్పిస్తే పరిష్కారం సులభం. తొందరపాటు, ఆవేశం తెచ్చుకోకుండా ప్రయత్నించండి.

 కె.శోభ, ఫ్యామిలీ కౌన్సెలర్‌, హార్ట్‌ టు హార్ట్‌

shobhas292@gmail.com

Updated Date - 2020-02-20T05:42:59+05:30 IST