వాట్సాప్‌లో హోలీ స్టిక్కర్స్ ఎలా పంపాలో తెలుసా..

ABN , First Publish Date - 2022-03-12T21:09:35+05:30 IST

దూరంగా ఉన్న ఆత్మీయులకు హోలీ గ్రీటింగ్స్ చెప్పాలంటే వాట్సాప్ స్టిక్కర్స్, ఎమోక్షన్స్ వంటివి వాడుకోవాలి. వాట్సాప్‌లో ఇన్‌బిల్ట్‌గా ఉన్న జిఫ్ సెర్చ్ ఫీచర్ ద్వారా జిఫ్ ఫైల్స్ నేరుగా పంపేవీలుంది.

వాట్సాప్‌లో హోలీ స్టిక్కర్స్ ఎలా పంపాలో తెలుసా..

మరో వారం రోజుల్లో హోలీ వేడుక రాబోతుంది. దగ్గరగా ఉన్నవాళ్లకు నేరుగా శుభాకంక్షలు చెప్పి, హోలీ వేడుకలు చేసుకోవచ్చు. అయితే, దూరంగా ఉన్న ఆత్మీయులకు హోలీ గ్రీటింగ్స్ చెప్పాలంటే వాట్సాప్ స్టిక్కర్స్, ఎమోక్షన్స్ వంటివి వాడుకోవాలి. వాట్సాప్‌లో ఇన్‌బిల్ట్‌గా ఉన్న జిఫ్ సెర్చ్ ఫీచర్ ద్వారా జిఫ్ ఫైల్స్ నేరుగా పంపేవీలుంది. అయితే స్టిక్కర్స్ పంపాలంటే మాత్రం థర్డ్‌పార్టీ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. థర్డ్‌పార్టీ యాప్స్ ఆండ్రాయిడ్ ఫోన్లపై మాత్రమే పనిచేస్తాయి. ఐఓఎస్ ఫోన్లపై పనిచేయవు. అందువల్ల ఆండ్రాయిడ్ యూజర్లు మాత్రమే యాప్స్  డౌన్‌లోడ్ చేసుకుని, స్టిక్కర్స్ పంపేవీలుంది. ఐఓఎస్ యూజర్లు నేరుగా డౌన్‌లోడ్ చేసుకోలేకపోయినా, తమ ఫ్రెండ్స్ పంపిన స్టిక్కర్లు మాత్రం వాడుకోవచ్చు.


ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

స్టిక్కర్ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం చాలా సింపుల్. గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి, హోలీ వాట్సాప్ స్టిక్కర్స్ అని టైప్ చేస్తే బోలెడన్ని యాప్స్ కనిపిస్తాయి. నచ్చిన యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి, స్టిక్కర్స్ వాట్సాప్‌లో యాడ్ చేసుకోవాలి. తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి, చాట్స్ విండోపై క్లిక్ చేసి, స్మైలీ ఐకాన్‌పై క్లిక్ చేసి నచ్చిన స్టిక్కర్స్ సెలక్ట్ చేసుకోవచ్చు. తర్వాత కావాల్సిన వాళ్లకు సెండ్ చేయొచ్చు.

Updated Date - 2022-03-12T21:09:35+05:30 IST