వాట్సప్‌లో లార్జ్‌ఫైల్స్‌ పంపించాలంటే..!

ABN , First Publish Date - 2020-08-08T05:47:45+05:30 IST

వాట్సప్‌లో ఫోటోలు, వీడియోలు, పీడీఎఫ్‌లు.. ఇలా రకరకాల ఫైల్స్‌ షేర్‌ చేస్తుంటాం! అయితే వాటి సైజు మాత్రం 16 ఎంబీ మించకూడదు. అందుకే వాట్సప్‌లో షేర్‌ చేసిన ఫోటోలు చాలా తక్కువ సైజులో ఉంటాయి...

వాట్సప్‌లో లార్జ్‌ఫైల్స్‌ పంపించాలంటే..!

వాట్సప్‌లో ఫోటోలు, వీడియోలు, పీడీఎఫ్‌లు.. ఇలా రకరకాల ఫైల్స్‌ షేర్‌ చేస్తుంటాం! అయితే వాటి సైజు మాత్రం 16 ఎంబీ మించకూడదు. అందుకే వాట్సప్‌లో షేర్‌ చేసిన ఫోటోలు చాలా తక్కువ సైజులో ఉంటాయి. కానీ చిన్న ట్రిక్‌ ఫాలో అయితే వాట్సప్‌లో 100 ఎంబి సైజు ఉన్న ఫైల్‌ను కూడా షేర్‌ చేయవచ్చు. ఎలా అంటే...


  1. ముందుగా గూగుల్‌ డ్రైవ్‌ ఓపెన్‌ చేయాలి.
  2. కింద కనిపిస్తున్న ప్లస్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేయాలి. అందులో అప్‌లోడ్‌ ఫైల్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  3. ఇప్పుడు మీరు పంపించాలనుకుంటున్న ఫైల్‌పై క్లిక్‌ చేస్తే ఆ ఫైల్‌ డ్రైవ్‌లోకి అప్‌లోడ్‌ అవుతుంది.
  4. తరువాత ఆ ఫైల్‌ కుడి వైపు కార్నర్‌లో ఉన్న త్రీడాట్స్‌ పై క్లిక్‌ చేయాలి.
  5. అక్కడ కాపీ లింక్‌ ఆప్షన్‌ను ఎంచుకుంటే ఆ ఫైల్‌ లింక్‌ క్లిప్‌బోర్డ్‌పై సేవ్‌ అవుతుంది.
  6. ఇప్పుడు వాట్సప్‌లోకి వెళ్లి ఫైల్‌ను పంపాలనుకుంటున్న కాంటాక్ట్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి.
  7. లాంగ్‌ప్రెస్‌ చేస్తే పేస్ట్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకుంటే లింక్‌ కాపీ అవుతుంది. తరువాత సెండ్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.
  8. అంతే... మీరు పంపాలనుకున్న ఫైల్‌ సైజుతో పనిలేకుండా చేరిపోతుంది.

Updated Date - 2020-08-08T05:47:45+05:30 IST