రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీళ్లను తాగుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి!

ABN , First Publish Date - 2022-04-19T19:04:02+05:30 IST

ఆరోగ్యం మీద ఆసక్తి పెరిగింది. దాంతో రాగి పాత్రలు, గ్లాసును ఉపయోగించడం మొదలుపెట్టాం. అయితే రాగి లోహం కొన్ని పదార్థాల్లోని రసాయనాలతో,

రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీళ్లను తాగుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి!

ఆంధ్రజ్యోతి(19-04-2022) 

ఆరోగ్యం మీద ఆసక్తి పెరిగింది. దాంతో రాగి పాత్రలు, గ్లాసును ఉపయోగించడం మొదలుపెట్టాం. అయితే రాగి లోహం కొన్ని పదార్థాల్లోని రసాయనాలతో, ఎంజైమ్స్‌తో ప్రతిచర్య జరిగి ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి కొంత అవగాహన ఏర్పరుచుకోవడం అవసరం.


పుల్లని పదార్థాలను రాగి పాత్రలో వండడం, నిల్వ చేయడం చేయకూడదు. ఇలా చేయడం వల్ల వాటిలోని ఆమ్లత్వం రాగి లోహంతో ప్రతిచర్య జరిగి, వాటిని తినడం మూలంగా ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి పచ్చళ్లు, నిమ్మ, నారింజ, బత్తాయి మొదలైన పండ్ల రసాలు నిల్వ చేయకూడదు. పాలు, పెరుగులను కూడా రాగి పాత్రల్లో నిల్వ చేయకూడదు.


లీటరు నీళ్లలో రాగి లోహం రెండు మిల్లీగ్రాములకు మించకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఒక రోజులో గరిష్ఠంగా 8 గ్రాములకు మించి రాగి లోహం శరీరంలోకి చేరుకోకూడదు. కాబట్టి రాగి పాత్రల్లో నీళ్లు నిల్వ చేసి తాగే వాళ్లు రోజుకు ఒక లీటరు నీటికి మించి తీసుకోకపోవడమే మేలు. 

Updated Date - 2022-04-19T19:04:02+05:30 IST