డియోడరెంట్‌ వాడకం ఇలా...

ABN , First Publish Date - 2021-04-10T05:30:00+05:30 IST

వేసవిలో డియోడరెంట్ల వాడకం ఎక్కువ. చెమట దుర్వాసనను దాచడం కోసం కొందరు వాడితే, పరిమళాలు వెదజల్లడం కోసం మరికొందరు వీటిని ఎంచుకుంటూ ఉంటారు. అయితే ఎక్కువ సందర్భాల్లో ఈ డియోడరెంట్ల సామర్థ్యం మీద అనుమానాలు

డియోడరెంట్‌ వాడకం ఇలా...

వేసవిలో డియోడరెంట్ల వాడకం ఎక్కువ. చెమట దుర్వాసనను దాచడం కోసం కొందరు వాడితే, పరిమళాలు వెదజల్లడం కోసం మరికొందరు వీటిని ఎంచుకుంటూ ఉంటారు. అయితే ఎక్కువ సందర్భాల్లో ఈ డియోడరెంట్ల సామర్థ్యం మీద అనుమానాలు తలెత్తుతూ ఉంటాయి. నిజానికి వాటిని వాడే పద్ధతులు పాటించినప్పుడే డియోడరెంట్‌ పూర్తి లాభాలు పొందవచ్చు.

  • ఆ ప్రదేశాల్లో: ఒక్కోసారి ఒక లేయర్‌ డియోడరెంట్‌ సరిపోకపోవచ్చు. కాబట్టి చర్మ రంధ్రాలు కవర్‌ అయ్యేలా ఎక్కువే వాడుకోవాలి. మరీ ముఖ్యంగా బాహుమూలల్లో ఎక్కువ వాడాలి. స్నానం చేసిన వెంటనే డియోడరెంట్‌ వాడినా, మళ్లీ మీటింగ్‌కి వెళ్లే ముందు, ఎవరినైనా కలవడానికి బయల్దేరే ముందు రెండోసారీ వాడాలి. మోకాళ్ల వెనక, తొడల మధ్య కూడా ఉపయోగించాలి. 

  • షేవ్‌ అవగానే వద్దు: బాహుమూలలు షేవ్‌ చేసిన వెంటనే డియోడరెంట్‌ అప్లై చేస్తే చర్మం కందిపోయి, మంటగా అనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి షేవ్‌ చేసిన వెంటనే కాకుండా కాస్త ఆగి, డియోడరెంట్‌ వాడుకోవాలి.

  • మారుస్తూ ఉండాలి: ఏళ్లతరబడి ఒకే రకం డియోడరెంట్‌ వాడితే, దానికి స్వేదగ్రంధులు అలవాటుపడిపోతూ ఉంటాయి. దాంతో డియోడరెంట్‌ ప్రభావాన్ని దాటుకుని స్వేదం, దుర్గంధం వెలువడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తరచుగా డియోడరెంట్లను మారుస్తూ ఉండాలి.

Updated Date - 2021-04-10T05:30:00+05:30 IST