యోగ.. నా సోదరి జీవితాన్ని మార్చేసింది: కంగనా

Jun 21 2021 @ 20:55PM

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నటి కంగనా రనౌత్‌ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ.. తన సోదరి జీవితంలో ఈ యోగా ఎంత విశిష్టంగా మారిందో సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. కంగనా, అతని సోదరి రంగోలీ ఫైర్‌ బ్రాండ్స్‌గా సోషల్‌ మీడియాలో పిలవబడుతుంటారు. కానీ రంగోలి గురించి కంగనా చెప్పిన విషయం వింటే.. ఎందుకలా వారు మారారో అర్థం చేసుకోవచ్చు.  తన సోదరి రంగోలి 21 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పై ఓ ప్రేమోన్మాది చేసిన యాసిడ్‌ అటాక్‌.. గురించి ఈ పోస్ట్‌లో కంగనా తెలియజేసింది. 


''21 సంవత్సరాల వయసులో రంగోలిపై యాసిడ్‌ అటాక్‌ జరిగింది. ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్న ఓ ఆకతాయికి.. రంగోలి నో చెప్పడంతో.. అతను యాసిడ్‌తో అటాక్‌ చేశాడు. దీంతో ఆమె ముఖం సగభాగం కాలిపోయింది. కంటి చూపు కూడా పోయింది. ఛాతి భాగంతో పాటు ఒక చెవి కూడా కాలిపోయింది. మూడు సంవత్సరాల పాటు 53 సర్జరీలు ఆమెకు జరిగాయి. ఈ అటాక్‌కి కొన్ని రోజుల ముందే రంగోలికి ఎయిర్‌ ఫోర్స్‌ అధికారితో నిశ్చితార్థం  అయింది. ఈ దాడి తర్వాత అతను నో చెప్పేయడంతో.. మానసికంగా కూడా తను బాధకు లోనైంది. ఎవరితో మాట్లాడేది కాదు. మేం ఎంత ప్రయత్నించినా.. సమాధానం చెప్పేది కాదు. మానసిక నిపుణులను ఎంతోమందిని కలిశాం. ఎన్నో మందులు వాడాం. కూర్చుని అలా చూసేది తప్ప.. ఆమెలో ఎటువంటి మార్పు రాలేదు. అలాంటి సందర్భంలో రంగోలిని నాతో పాటు యోగా క్లాస్‌కు తీసుకు వెళ్లడం మొదలెట్టాను. క్రమక్రమంగా తనలో మార్పు మొదలైంది. నాతో పాటు యోగా చేయడం మొదలెట్టింది. అలా రంగోలి యోగా చేయడం మొదలైనప్పటి నుంచి.. తన జీవితంలో మార్పులు మొదలయ్యాయి. అందరితో మాట్లాడటం మొదలెట్టింది. అంతే కాదు.. ఆమె కంటి చూపు కూడా మెరుగుపడింది.." అని కంగనా యోగా యొక్క విశిష్టతను తెలిపింది.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.