హెచ్‌ఆర్‌ఏ వెంటనే అమలు చేయాలి

ABN , First Publish Date - 2021-03-06T06:29:41+05:30 IST

సింగరేణి విస్తరించిన జిల్లాల్లో నూతనంగా ఏర్పడిన మున్సిపల్‌ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు హెచ్‌ఆర్‌ఏ పదిశాతం వెంటనే అమలు చేయాలని కోరుతూ శుక్రవారం డైరెక్టర్‌(ఫైనాన్స్‌, పీఆండ్‌పీ) బలరాంకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.

హెచ్‌ఆర్‌ఏ వెంటనే అమలు చేయాలి
డైరెక్టర్‌ బలరాంకు వినతి పత్రం సమర్పిస్తున్న ఏఐటీయూసీ నాయకులు

శ్రీరాంపూర్‌, మార్చి 5: సింగరేణి విస్తరించిన జిల్లాల్లో నూతనంగా ఏర్పడిన మున్సిపల్‌ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు హెచ్‌ఆర్‌ఏ పదిశాతం వెంటనే అమలు చేయాలని కోరుతూ శుక్రవారం డైరెక్టర్‌(ఫైనాన్స్‌, పీఆండ్‌పీ) బలరాంకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. మరో కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారామయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బాజీసైదా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్‌ ఆధ్వర్యంలో వివిధ గనుల కార్మికులు తరలి వచ్చి జీఎం కార్యాలయం వద్ద బైఠాయించారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు. అనంతరం జీఎంకు వినతి పత్రం సమర్పించారు.

Updated Date - 2021-03-06T06:29:41+05:30 IST