రాముడు కాదు రావణుడు

ABN , First Publish Date - 2021-01-31T05:38:32+05:30 IST

బాలీవుడ్‌లో రామాయణం ఆధారంగా మరో చిత్రం వస్తోంది. ఇందులో సీతారాముల పాత్రల్లో హృతిక్‌రోషన్‌, దీపికా పడుకోన్‌ నటిస్తున్నారని

రాముడు కాదు రావణుడు

బాలీవుడ్‌లో రామాయణం ఆధారంగా మరో చిత్రం వస్తోంది. ఇందులో సీతారాముల పాత్రల్లో హృతిక్‌రోషన్‌, దీపికా పడుకోన్‌ నటిస్తున్నారని సమాచారం. ఇప్పటికే వీరిద్దరూ సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ‘ఫైటర్‌’ చిత్రంలో నటిస్తున్నారు. దీపిక టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న ‘ద్రౌపది’ చిత్రాన్ని నిర్మిస్తోన్న మధు మంతెన దీనికి నిర్మాత. ఈ చిత్రాన్ని 3డీలో తెరకెక్కిస్తున్నారు. హృతిక్‌ రాముడిగా నటిస్తున్నాడనే వార్త సోషల్‌ మీడియాలో వైరలవడంతో ఆయనపై కంగన అభిమానులు విమర్శలకు దిగారు.


‘శ్రీరాముడి పాత్ర పోషించే అర్హత  హృతిక్‌కి లేదు. అతను రావణుడి పాత్రకు చక్కగా సరిపోతాడు’ అని సెటైర్లు వేస్తున్నారు. ‘ద్రౌపది’ చిత్రంలో కూడా హృతిక్‌ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారని సమాచారం. ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘ఆదిపురుష్‌’ చిత్రం రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. 

Updated Date - 2021-01-31T05:38:32+05:30 IST