
హృతిక్ రోషన్, సుసానే ఖాన్ తమ 13ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలికారు. వారు 7ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. అనంతరం సుసానే ఖాన్, అర్స్లన్ గోనితో డేటింగ్ చేస్తున్నట్టు వదంతులు షికార్లు చేస్తున్నాయి. తన 43వ బర్త్డే పార్టీని ఆమె గోవాలో జరుపుకుంది. ఆ బర్త్డే పార్టీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారాయి.
ఆ బర్త్డే పార్టీకి బాలీవుడ్ సెలెబ్రిటీలైన అనుష్క రంజన్, ఆదిత్య సీల్ తదితరులు హాజరయ్యారు. అనుష్క ఆ బర్త్డే పార్టీ వీడియోకు సంబంధించిన చిన్న భాగాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. గోవాలోని ఒక రిసార్ట్లో ఈ బర్త్డే పార్టీ జరిగినట్టు తెలుస్తోంది. లెదర్ స్కర్ట్, బ్రౌన్ టాప్ ధరించి సుసానే వీడియోలో కనిపించింది. ప్రతి ఒక్కరూ హ్యాపీ బర్త్డే అంటూ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆదిత్య సీల్ ఆ పార్టీకి సంబంధించిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు.
బాయ్ ప్రెండ్ అర్స్లన్ గోని ఆమెతో దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ కింద..‘‘ హ్యాపీ, హ్యాపీ బర్త్ డే డార్లింగ్. జీవితంలో నిన్ను కలుసుకోవడంతోనే నాకు ఈ ఫొటో దొరికింది. నీకు దేవుడు ప్రతి ఒక్కటి ఇవ్వాలని కోరకుంటున్నాను’’ అని ఆయన రాశాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై ఎవ్రీథింగ్ అంటూ హార్ట్ ఎమోజీలతో సుసానే రిప్లై ఇచ్చింది.
హృతిక్ రోషన్, సుసానే ఖాన్ 2000 డిసెబరు 20న పెళ్లి చేసుకున్నారు. వీరికి రిహాన్, హ్రీదాన్ అనే ఇద్దరు కొడుకులున్నారు. 2013 డిసెంబరులో వీరు విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం హృతిక్ ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘‘ సుసానే నా నుంచి విడిపోవాలనుకుంది. ఈ ఘటన నాకు, నా కుటుంబానికి విచారం కలిగించింది ’’అని ఆయన తెలిపారు.