
బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ జనవరి 10న 48వ పుట్టిన రోజు జరుపుకొంటున్నాడు. అతడికి అనుకోని అతిథి శుభాకాంక్షలు చెప్పింది. మాజీ భార్య సుసానే ఖాన్ అతడికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ పెట్టింది . హృతిక్ కొడుకులతో ఉన్న వీడియోని సుసానే ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. ఫాదర్ గోల్స్ అని క్యాప్షన్ రాసింది. హృతిక్ రోషన్, సుసానే ఖాన్కు హ్రీహాన్, హ్రీదాన్ అనే ఇద్దరు కొడుకులు ఉన్న సంగతి తెలిసిందే. ‘‘ హ్యాపీ, హ్యాపీ బర్త్ డే రే.. హ్రీహాన్, హ్రీదాన్ అదృష్టవంతులు.. ఎందుకంటే వారికి నాన్నగా నువ్వు లభించావు.. నీ కలలు, కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నాను. ఎల్లప్పుడు నీకు బిగ్ హగ్ ’’ అని సుసానే ఖాన్ ఇన్స్టాగ్రాంలో పోస్ట్ పెట్టింది.
సుసానే ఖాన్, హృతిక్ రోషన్ 2000లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం 2014లో విడాకులు తీసుకున్నారు. ఈ దంపతులకు హ్రీహాన్, హ్రీదాన్ అనే ఇద్దరు కొడుకులున్నారు. సుసానే ప్రస్తుతం అర్స్లన్ గోనితో డేటింగ్ చేస్తున్నట్టు బీ టౌన్ మీడియా తెలుపుతోంది. తన పుట్టిన రోజు సందర్భంగా హృతిక్ కొత్త సినిమాని ప్రకటించాడు. ‘‘ ఫైటర్’’ అని ఆ సినిమాకు టైటిల్ పెట్టారు. దీపికా పదుకొణె హీరోయిన్గా నటించనుంది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్నారు.