హృతిక్‌ రోషన్‌కు జంటగా...

Jul 30 2021 @ 22:38PM

నభా నటేశ్‌కు హిందీ చిత్రసీమ నుంచి పిలుపు వచ్చిందా? హృతిక్‌ రోషన్‌కు జంటగా నటించే అవకాశం లభించిందా? అంటే... ‘అవును’ అని ముంబై వర్గాల నుంచి వినపడుతోంది. త్వరలో ‘ఫైటర్‌’ సినిమాను సెట్స్‌కు తీసుకువెళ్లనున్న హృతిక్‌, ఆ తర్వాత ఓ వెబ్‌ సిరీస్‌ చేయనున్నారు. జాన్‌ లుకరే రాసిన పుస్తకం ‘ద నైట్‌ మేనేజర్‌’ ఆధారంగా, అదే పేరుతో ఓ బ్రిటీష్‌ స్పై థ్రిల్లర్‌ తెరకెక్కింది. దానిని హిందీలో హృతిక్‌ రీమేక్‌ చేస్తున్నారు. అందులో ఆయనకు జంటగా నటించే అవకాశం నభా నటేశ్‌కు లభించిందట. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.