సదరు ఈ-మెయిల్ ఐడీని హృతికే తనకు ఇచ్చాడని, ఆ మెయిల్ ద్వారానే తాము రెండేళ్ల పాటు ఛాటింగ్ చేసుకున్నామని కంగన వివరణ ఇచ్చింది. దీంతో 2016లోనే ఈ కేసు విచారణ నిమిత్తం హృతిక్ ల్యాప్‌టాప్, ఫోన్‌ను ముంబై సైబర్ సెల్ స్వాధీనం చేసుకుంది. కంగన స్టేట్మెంట్ను కూడా రికార్డు చేసింది. అయితే హృతిక్ విజ్ఞప్తి మేరకు ఈ కేసును గతేడాది డిసెంబర్లో ముంబై సైబర్ సెల్ నుంచి క్రిమినల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం క్రిమినల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈ కేసును విచారిస్తోంది.