'శుభ్ మంగళ్ సావధాన్' కాంబో మరోసారి

Jun 16 2021 @ 14:30PM

'శుభ్ మంగళ్ సావధాన్' కాంబో మరోసారి రిపీట్ కానుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ ప్రొడ్యుసర్, డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్ ఆయుష్మాన్ ఖురానాతో  'శుభ్ మంగళ్ సావధాన్' చిత్రాల్ని నిర్మించాడు. వారిద్దరి కాంబినేషన్‌లో 'శుభ్ మంగళ్ సావధాన్', 'శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్' వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. బాలీవుడ్‌లో వీరి కాంబోకి మంచి క్రేజ్ ఉంది. కాగా ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్‌లో సినిమాకి సన్నాహాలు చేస్తున్నారట. అయితే ఇంతక ముందు వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'శుభ్ మంగళ్ సావధాన్' ఫ్రాంఛైజీలో సినిమా కాకుండా పూర్తిగా వేరే కథతో రూపొందనుందని తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన మెజారిటీ షూటింగ్ యూఎస్ఏలో షూటింగ్ జరగనుందట. ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా నటిస్తున్న 'డాక్టర్ జీ' పూర్తి చేసి కొత్త సినిమా మొదలుపెట్టనున్నారు. నవంబర్ నుంచి చిత్రీకరణ మొదలవనున్న దీని ద్వారా అనిరుధ్ అయ్యర్ గణపతి అనే నూతన దర్శకుడు బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు.  

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.