Special trains: హుబ్లీ - రామేశ్వరం మధ్య ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2022-08-06T15:21:27+05:30 IST

హుబ్లీ-రామేశ్వరం(Hubli-Rameswaram) మధ్య ఈనెల 6నుంచి ప్రత్యేక రైళ్లు నడవనున్నట్లు దక్షిణరైల్వే(Southern Railway) ప్రకటించింది. ఆ వివరాలిలా

Special trains: హుబ్లీ - రామేశ్వరం మధ్య ప్రత్యేక రైళ్లు

చెన్నై,ఆగస్టు5(ఆంధ్రజ్యోతి): హుబ్లీ-రామేశ్వరం(Hubli-Rameswaram) మధ్య ఈనెల 6నుంచి ప్రత్యేక రైళ్లు నడవనున్నట్లు దక్షిణరైల్వే(Southern Railway) ప్రకటించింది. ఆ వివరాలిలా వున్నాయి... హుబ్లీలో ఈనెల 6, 13, 20, 27, సెప్టెంబరు3, 10, 17, 24 తేదీల్లో ఉదయం 6.30 గంటలకు బయలుదేరే ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ (07353) మరుసటి రోజు ఉదయం 6.15 గంటలకు రామేశ్వరం చేరుకుంటుంది. తిరిగి అదే రైలు (07354) రామేశ్వరంలో ఈ నెల 7, 14, 21, 28, సెప్టెంబరు 4, 11, 18, 25 తేదీల్లో సాయంత్రం 9 గంటలకు బయలుదేరి మరునాడు సాయంత్రం 7.25 గంటలకు హుబ్లీ చేరుకుంటుంది. ఈ రైళ్లకు ఏసీ టూ టైర్‌, 3 ఏసీ త్రీ టైర్‌, 9 స్లీపర్‌, 5 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ బోగీలు, 2 దివ్యాంగులకు అనువైన బోగీలుంటాయి. ఈ రైళ్లు హవేరి, రాణీబెన్నూరు, హరిహర్‌, దావణగెరె, చిక్‌జాజూర్‌, బిరూర్‌, అర్సికేరె, తుముకూర్‌, యశ్వంత్‌పూర్‌(Yeswantpur), బనస్వాడి, హోసూరు, ధర్మపురి, ఓమలూర్‌, సేలం, నామక్కల్‌, కరూర్‌, తిరుచ్చి, పుదుకోట, కారైక్కుడి, మానామదురై, రామనాథపురం స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లకు ఇప్పటికే అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ ప్రారంభించారు.

Updated Date - 2022-08-06T15:21:27+05:30 IST