మిజోరంలో భారీగా ఆయుధాలు స్వాధీనం, నలుగురి అరెస్టు

ABN , First Publish Date - 2022-05-02T19:47:54+05:30 IST

అసోం రైఫిల్స్‌కు చెందిన 23వ సెక్టార్ ఐజ్వాల్ పోలీసులు ఆదివారంనాడు పెద్దఎత్తున...

మిజోరంలో భారీగా ఆయుధాలు స్వాధీనం, నలుగురి అరెస్టు

ఐజ్వాల్: అసోం రైఫిల్స్‌కు చెందిన 23వ సెక్టార్ ఐజ్వాల్ పోలీసులు ఆదివారంనాడు పెద్దఎత్తున అక్రమ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్ధాలను మిజోరాంలో స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నారు. ఆయుధాల అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. ఐజ్వాల్ జిల్లా కెల్సిహ్ గ్రామం సమీపంలో ఆ అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.


పారా మిలటరీ బృందాలు రెండు వాహనాలను అడ్డుకుని భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయని, వీటిలో మూడు షాట్ గన్‌లు, ఐదు పాయింట్ 22 రైఫిల్స్, 20 బాక్సుల పెల్లెట్లు, 3000 కిలోల బరువైన 24,000 జెలిటిన్ స్కిక్‌లు, 44 కేజీల సేఫ్టీ ఫ్యూజ్‌లు, 100 కేజీల గున్‌పౌడర్ తదితరాలు ఉన్నట్టు అధికారులు చెప్పారు. అక్రమ రవాణా సాగిస్తున్న రెండు వాహనాలను కూడా సీజ్ చేసినట్టు చెప్పారు. మయన్మార్ నుంచి ఈ ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్మగుల్ అవుతున్నట్టు ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ అధికారులు అనుమానిస్తున్నారు.

Updated Date - 2022-05-02T19:47:54+05:30 IST