తవ్వకాల్లో బయపడిన అతిపెద్ద మొసలి... చూడగానే హడల్!

ABN , First Publish Date - 2021-03-01T11:54:28+05:30 IST

గుజరాత్‌లోని వడోదర పరిధిలో గల కెలన్‌పూర్ ప్రాంతంలోని...

తవ్వకాల్లో బయపడిన అతిపెద్ద మొసలి... చూడగానే హడల్!

వడోదర: గుజరాత్‌లోని వడోదర పరిధిలో గల కెలన్‌పూర్ ప్రాంతంలోని ఒక నిర్మాణ స్థలంలో తవ్వకాలు జరుపుతుండగా ఏకంగా 11 అడుగుల అతిపెద్ద మొసలి బయటకు వచ్చి, అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. దానిని చూసి హడలెత్తిపోయిన స్థానికులు దానికి ఎటువంటి హాని కలుగకుండా సంరక్షించారు.


వన్యప్రాణి సంరక్షణ సంస్థ అధ్యక్షుడు అరవింద్ పవార్ తెలిపిన వివరాల ప్రకారం ఆ మొసలి 10 నుంచి 11 అడుగుల వరకూ ఉంది. ఒక నిర్మాణ స్థలంలో ఆ మొసలిని స్థానికులు గమనించారు. తమకు ఈ విషయాన్ని ఒక బిల్డర్ తెలియజేశాడన్నారు. దానిని కాపాడి అటవీశాఖ అధికారులకు అప్పగించామని తెలిపారు. కాగా  ఆ మొసలిని పట్టుకున్న తరువాత దానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అది ఆరోగ్యంగానే ఉందని గుర్తించిన అనంతరం దానిని అటవీప్రాంతంలోని ఒక చెరువులో విడిచిపెట్టారు. కాగా ఇప్పుడు ఈ మొసలికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇంతపెద్ద మొసలిని తాము ఎప్పుడూ చూడలేదంటూ పలువురు కామెంట్లు రాస్తున్నారు.

Updated Date - 2021-03-01T11:54:28+05:30 IST